Chhattisgarh : బొగ్గు తవ్వకాలను నిరసిస్తూ…300 కి.మీ పాదయాత్ర
బొగ్గు తవ్వకాల ప్రాజెక్టులు వద్దని, అక్రమంగా భూ సేకరణ చేస్తున్నారంటూ...గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు.

Padhyatra
Chhattisgarh Lungs From Mining : తమ సమస్యలు తీర్చాలని, జీవనాధారానికి నష్టం కలిగించవద్దని కోరుతూ..కొంతమంది నిరసనలు, ఆందోళనలు తెలియచేస్తుంటారు. పాలకులకు తెలియచెప్పేందుకు వినూత్నంగా తమ నిరసనను వ్యక్త పరుస్తుంటారు. బొగ్గు తవ్వకం ప్రాజెక్టులు వద్దని, అక్రమంగా భూ సేకరణ చేస్తున్నారంటూ…గ్రామస్తులు పాదయాత్ర చేపట్టారు. ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 300 కిలోమీటర్ల మేర వారు నడువనున్నారు. Hasdeo Aranya ప్రాంతంలో బొగ్గు తవ్వకాలపై అభ్యంతరం తెలుపుతున్నారు. దీనికి వ్యతేరకంగా సమీప గ్రామస్తులు గళం విప్పతున్నారు.
Read More : Covid-19 : దేశంలో నిన్న కొత్తగా 15,823 కోవిడ్ కేసులు
ఛత్తీస్ గడ్ లోని సర్గుజా, కోర్బా జిల్లాలోని 30 గ్రామాల గిరిజన సంఘాల నుంచి 350 మంది ప్రజలు స్వచ్చందంగా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. గత 9 రోజుల నుంచి వీరు నడుచుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అక్రమంగా భూ సేకరణ చేస్తూ..తవ్వకాలు చేపడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తాము ఇప్పుడు ఈ నిరసన చేపట్టకపోతే..తమ పిల్లలు జీవించడానికి కష్టమౌతుందన్నారు. సర్గూజా జిల్లాలోని అంబికాపూర్..ఫతేపూర్ నుంచి అక్టోబర్ 03వ తేద నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అక్టోబర్ 13వ తేదీన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకరావాలని అనుకుంటున్నారు.
Read More : Aha: దసరా టూ సంక్రాంతి.. ప్రేక్షకులకు నాన్ స్టాప్ పండగే!
అటవీ పర్యావరణ వ్యవస్థలను నాశనం చేస్తున్నారని, ఎంతో సమృద్ధిగా ఉన్న ఈ ప్రాంతం..బొగ్గు తవ్వకాలతో నష్టం ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆరు బొగ్గు బ్లాక్ లు కేటాయించారని, వీటిలో రెండు మైనింగ్ కోసం పని చేస్తున్నాయని Hasdeo అరణ్య బచావ్ సమితి వెల్లడించింది. గ్రామసభ అనుమతి లేకుండానే..భూ సేకరణ ప్రక్రియ ప్రారంభమైందని ఆరోపిస్తుండగా…మరొక బ్లాక్ కు అటవీ పర్యావరణ అనుమతిని పొందింది. ఇతర బ్లాక్ లలో కూడా గ్రామసభల అనుమతి లేకుండా..భూసేకరణ ప్రారంభించారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, పర్యావరణ అనుమతి కోసం నకిలీ పత్రాల, తప్పుడు సమాచారం మంత్రిత్వ శాఖకు ఇచ్చారని ఆరోపణలు చేస్తున్నారు.
Read More :Telugu Akademi Scam : పదేళ్లలో రూ.200 కోట్లు మాయం.. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ కోట్లు కొట్టేశారు
2020, డిసెంబర్ 24వ తేదీన బొగ్గు బేరింగ్ ఏరియాస్ చట్టం 1957 సెక్షన్ 07 కింద నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యంతరాలకు 30 రోజుల సమయం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పలు లేఖలు అందాయని, 470కి పైగా అభ్యంతర లేఖలు వచ్చాయని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. పారదర్శకంగా…నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించబడుతుందన్నారు. పరిహారం సరిపోదని, డబ్బు అనేది భూమికి సమానమైంది కాదని, తమ ఇళ్లు ఇక్కడే ఉన్నాయన్నారు.