కుటుంబ పోషణ కోసం….గర్భం తీసేయించుకున్న 30వేల మంది కూలీలు

  • Published By: venkaiahnaidu ,Published On : December 25, 2019 / 03:03 PM IST
కుటుంబ పోషణ కోసం….గర్భం తీసేయించుకున్న 30వేల మంది కూలీలు

మహారాష్ట్ట్రలో వేల సంఖ్యలో మహిళలు ఆపరేషన్ చేయించుకుని గర్భసంచీ తీసేయించుకుంటున్నారు. అయితే పేదరికమే వారిని ఆ నిర్ణయం తీసుకునేట్లు చేస్తుంది. తమ కుటుంబ పోషణ కోసం వేల సంఖ్యలో మహిళలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆ మహిళలను ఆదుకోవాలంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే కాంగ్రెస్ నాయకుడు నితిన్ రౌత్ ఓ లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ గా కూడా ఉన్న రౌత్ సీఎం ఉద్దవ్ రాసిన లేఖలో…బీడ్,ఉస్మానాబాద్ ప్రాంతాలకు 30వేల మంది పేద మహిళా చెరకు కూలీలు…గర్భంతో ఉంటే పీరియడ్స్ సమయంలో పనిచేయలేమోనని,కూలీకి వెళ్లకుంటే కుటుంబం గడవదనే భయంతో ఆపరేషన్ చేయించుకుని గర్భం తీసేయించుకుంటున్నారని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన విషయం అని నితిన్ తెలిపారు. పేద చెరకు కూలీల వినతులను సీఎం పట్టించుకోవాలని,ప్రభుత్వం ఈ సమస్యకు ఓ పరిష్కారం కనుక్కోవాలని తాను సీఎంను కోరొనట్లు నితిన్ రౌత్ తెలిపారు.