Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..

దేశంలో కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. భారీగా రోజువారి కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,016 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆర్నెళ్ల కాలంలో ఈ స్థాయిలో రోజువారి కొవిడ్ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

Covid-19: దేశంలో మళ్లీ కోరలు చాస్తున్న కరోనా.. కొత్తగా 3,016 కేసులు నమోదు.. ఢిల్లీలో రికార్డు స్థాయిలో ..

Corona virus

Covid-19: కరోనా వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. వారంరోజుల క్రితం వరకు వెయ్యికి పరిమితమైన రోజువారి కోవిడ్ కేసుల నమోదు.. తాజాగా 3వేల మార్క్‌కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 3,016 కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో 24గంటల్లో దాదాపు 40శాతం కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగింది. రోజువారీ కేసుల విషయంలో దాదాపు ఆరు నెలల్లో ఇదే అత్యధికం. యాక్టివ్ కేసుల సంఖ్యకూడా పెరిగింది. దేశంలో 13,509 మంది కొవిడ్ తో చికిత్స పొందుతున్నారు. దీంతో పాజిటివిటీ రేటు 2.73శాతంకు చేరింది. వారం క్రితం పాజిటివిటీ రేటు 1.71శాతం ఉంది.

COVID-19: ఐదు నెలల తరువాత గరిష్ఠ స్థాయిలో.. ఒకేరోజు 2వేలకు‌పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో కోవిడ్-19 కారణంగా 14 మంది మరణించారు. దీంతో ఇప్పటికే దేశంలోకరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862 కు చేరింది. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు మరణించారు. కోవిడ్ కేసుల రికవరీ రేటు 98.78శాతం ఉంది. వారం రోజుల వ్యవధిలోనే కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జనవరి 16న జీరో కోవిడ్ కేసులు నమోదు కాగా, గడిచిన 24గంటల్లో 300 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

COVID-19: పెరుగుతున్న కోవిడ్ కేసులు.. వరుసగా రెండోరోజు 1800 కొత్త కేసులు.. 10వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 300 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏడు నెలల తర్వాత రోజువారి కేసుల సంఖ్య 300 మార్క్‌కు చేరింది. కరోనా కారణంగా ఇద్దరు మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 806 యక్టీవ్ కేసులు ఉన్నాయి. దీంతో రాజధానిలో ఇప్పటివరకు 20,09,361 కేసులు నమోదు కాగా, తాజాగా ఇద్దర మరణించడంతో మృతుల సంఖ్య 26,526 చేరింది.

Covid-19 Virus: కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీకైన వైరసే.. అమెరికా ఎనర్జీ డిపార్ట్‌మెంట్ నివేదిక.. ఖండించిన చైనా ..

రోజువారి కరోనా కేసుల పెరుగుదల‌పై ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గురువారం మధ్యాహ్నం అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులు, ప్రభుత్వ ఆసుపత్రుల మెడికల్ డైరెక్టర్లు పాల్గోనున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు.