లెక్కలంటే భయమట: 32ఏళ్ల తర్వాత 12వ తరగతి పాసైంది..

లెక్కలంటే భయమట: 32ఏళ్ల తర్వాత 12వ తరగతి పాసైంది..

50 సంవత్సరాల మహిళ మేఘాలయలో తన 12వ తరగతి పాస్ అయిపోయానంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. లెక్కలంటే భయమేసి పల్లెటూళ్లో ఉన్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లిపోయింది. మేఘాలయ బోర్డ్స్ హైయ్యర్ సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ (HSLLC), ఆర్ట్స్ స్ట్రీమ్ రిజల్ట్స్ సోమవారం విడుదల చేశారు. ఈ సారి పరీక్షల్లో లాకీంటీ సైంలీ పాసైపోయిందని వెబ్ సైట్లో ఫలితాలు చెబుతున్నాయి.

ఇనేళ్ల తర్వాత పాస్ అవడంతో గర్వంగా స్కూల్ యూనిఫాం వేసుకుని ఫొటో దిగింది లాకైంటీ. రిబోయ్ జిల్లాలలోని బలవాన్ కాలేజి క్లాసులకు రెండు సంవత్సరాల నుంచి అటెండ్ అవుతుంది. ‘పరీక్షలు పాస్ అవడంతో చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మేజర్ సబ్జెక్ట్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్ లో ఉన్నత విద్య చదవాలనుకుంటున్నా. అప్పట్లో లెక్కలు చాలా కష్టంగా ఉన్నాయని 1988లోనే చదువు ఆపేశా’

‘2008లో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ లో పాఠాలు చెప్పాలని జాబ్ వచ్చింది. అక్కడే మళ్లీ నేర్చుకోవడం మొదలుపెట్టా. 2015లో మిస్ లాకైంటీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ కోర్సును IGNOUలో పూర్తి చేసింది. 26సంవత్సరాల తర్వాత SSA స్కూళ్లో ఆమె ఎడ్యుకేషన్ ను తిరిగి ప్రారంభించింది.

మేఘాలయ ఎడ్యుకేషన్ మినిస్టర్ చదువుకు వయస్సుతో సంబంధం లేదని తెగ పొగిడేస్తున్నారు. చదువును మధ్యలో ఆపేసిన వారంతా మళ్లీ మొదలుపెట్టడానికి ఈమె మంచి ఉదాహరణ. ఆమె హార్డ్ వర్క్, డెడికేషన్ కు కంగ్రాట్స్ చెప్పడంతో పాటు అభినందిస్తున్నాం అని రైంబు అన్నారు. ఆమె స్టోరీ సోషల్ మీడియాలో ఫుల్ ఫ్యామస్ అయింది.