Omicron India : దేశంలో కొత్తగా 33 ఒమిక్రాన్ కేసులు.. రాజస్థాన్ లో 23, ఏపీలో 10 గుర్తింపు

రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అలాగే ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు.

Omicron India : దేశంలో కొత్తగా 33 ఒమిక్రాన్ కేసులు.. రాజస్థాన్ లో 23, ఏపీలో 10 గుర్తింపు

Omicron (1)

33 new Omicron cases in india : ప్రపంచదేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్..భారత్ ను కూడా కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. భారత్ లో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 33 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు, ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 814 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

రాజస్థాన్ లో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరింది. అలాగే ఏపీలో కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులను గుర్తించారు. దీంతో దీంతో ఏపీలో మొత్తం ఒమిక్రాన్ కేసులు 16కి చేరాయి. కొత్తగా నమోదైన 10 ఒమిక్రాన్ కేసుల్లో మూడు కాంటాక్టు కేసులు ఉన్నాయి. కువైట్, నైజీరియా, సౌదీ అరేబియా, యూఎస్ నుంచి వచ్చిన వారికి ఒమిక్రాన్ సోకింది.

Cocaine Seize : ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా కొకైన్ పట్టివేత.. కడుపులో దాచుకుని మహిళ అక్రమంగా తరలింపు

భారత్‌ పై ఒమిక్రాన్ ప్రతాపం చూపిస్తోంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 814 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. వేరియంట్ నుంచి 241 మంది కోలుకున్నారు. ఢిల్లీలో అత్యధికంగా 238 కేసులు నమోదయ్యాయి. 167 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. అటు కేరళలో 57, తెలంగాణలో 63 వేరియంట్‌ కేసులు నమోదయ్యాయి.

తొలుత సౌతాఫ్రికాలో నవంబర్ 24న వెలుగుచూసిన ఒమిక్రాన్.. ప్రపంచదేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. యూఏఈలో ఒక్కరోజే 1,732 కరోనా కేసులు నమోదవగా, ఒకరు కరోనాతో చనిపోయారు. యూఏఈలో ఇప్పటివరకు 7లక్షల 55వేల కరోనా కేసులు నమోదవగా.. 2వేల 160మంది కరోనాతో చనిపోయారు. ప్రస్తుతం 10వేల 186 యాక్టివ్ కేసులున్నాయి.