Omicron Cases : తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 33 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మరిన్ని రిపోర్టులు రావాల్సివుందని అధికారులు తెలిపారు.

Omicron Cases : తమిళనాడులో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు

Tamilnadu

new Omicron cases in Tamil Nadu : ప్రపంచదేశాలను వణికిస్తోన్నకరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ ను కూడా కలవర పెడుతోంది. దేశంలో ప్రతీరోజు భారీ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయి. తమిళనాడులో ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఒక్కరోజే 33 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు చేరింది. ఒక్కరోజులోనే ఈ స్థాయిలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగడంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది.

విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చిన 104 మందికి కరోనా పాజిటివ్ రాగా, వీరిలో 33 మందికి ఒమిక్రాన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. మరిన్ని రిపోర్టులు రావాల్సివుందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా నమోదైన 33 కేసుల్లో చెన్నైలో 26, మధురైలో 4, తిరువన్నమలైలో 2, సాలెంలో ఒక కేసును గుర్తించారు. వీరిందరినీ వెంటనే ఐసోలేషన్ సెంటర్లకు తరలించారు.

Lock Down : తెలంగాణలో ఫస్ట్ టైం ఒమిక్రాన్‌ కారణంగా గ్రామంలో లాక్ డౌన్

రిస్క్ కంట్రీస్, నాన్ రిస్క్ కంట్రీస్ అన్న తేడా లేకుండా విదేశాల నుంచి వచ్చిన వారందరిపై నిఘా ఉంచాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కరోనా సోకిన మొత్తం 104 మందిలో 82 మందిలో ఎస్జీనీ డ్రాప్ వేరియంట్ ఉందని అధికారులు తెలిపారు. ఒకే రోజు ఇన్ని కేసులు గుర్తించడంతో తమిళనాడు సర్కార్ అప్రమత్తం అయింది. జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసింది.

దేశంలోనూ ఒమిక్రాన్‌ కేసులు రాకెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్నాయి. ప్రతీరోజు భారీ సంఖ్యలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 250 దాటింది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 65 ఒమిక్రాన్‌ కేసులున్నాయి. ఢిల్లీలో 64, తెలంగాణలో 24 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.

Ashoka Gajapati Raju : కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజుపై కేసు నమోదు

రాజస్థాన్ 21, కర్ణాటక 19, కేరళ 15, గుజరాత్ 14, జమ్మూకాశ్మీర్ 3,ఉత్తరప్రదేశ్ 2, ఏపీలో 2, ఒడిశా 2, లడఖ్ 1, చండీగఢ్ 1, తమిళనాడు 34, పశ్చిమ బెంగాల్‌లో 1 ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా ఇతర రాష్ట్రాలకు ఒమిక్రాన్ వేరియెంట్ విస్తరిస్తోంది.

ఓమిక్రాన్ కేసులలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో ఢిల్లీ , తెలంగాణ , గుజరాత్‌, రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటి వరకు భారత్ లో ఒమిక్రాన్ నుంచి 104 మంది కోలుకున్నారు. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కోవిడ్, ఒమిక్రాన్ పరిస్థితులపై నేడు ప్రధాని మోడీ కీలక సమీక్ష చేపట్టనున్నారు.