కరోనా : ఢిల్లీలో 35 భవనాల్లో హోం షెల్టర్స్..ఆహారం కూడా

  • Published By: madhu ,Published On : March 27, 2020 / 04:03 AM IST
కరోనా : ఢిల్లీలో 35 భవనాల్లో హోం షెల్టర్స్..ఆహారం కూడా

కరోనా వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటోంది. దేశ రాజధానిలో కూడా వైరస్ ప్రబలుతోంది. ఈ కారణంగా ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా ఢిల్లీలో నైట్ షెల్టర్స్ వద్ద రద్దీ పెరుగుతోంది. దీనిపై ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్ మెంట్ బోర్డు (DUSIB) దృష్టి సారించింది.

ఖాళీగా ఉన్న భవంతులను షెల్టర్ హోమ్స్ గా మార్చివేసింది. 2020, మార్చి 27వ తేదీ శుక్రవారం నుంచి పనిచేస్తాయని, రద్దీగా ఉన్న ఆశ్రయాలను కొత్తవాటికి మార్చివేస్తామని DUSIB సభ్యుడు బిపిన్ రాయ్ వెల్లడించారు. లాక్ డౌన్ నేపథ్యంలో రవాణా సౌకర్యాలను నిలిపివేసింది ప్రభుత్వం. దీంతో ఇక్కడున్న నివాసం ఉంటున్న వలస కూలీలు, కార్మికులు వారి వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

వందల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత మూడు రోజుల నుంచి షెల్టర్ వద్ద రద్దీ పెరిగిందని తెలిపారు. జామా మసీదు, యమునా పుష్తా, కశ్మీర్ గేట్ల వద్దనున్న 22 షెల్టర్లలలో రద్దీ పెరిగిపోయింది. యమునా బజార్ లో 50 మంది సామర్థ్యం గ ఓ షెల్టర్ హోమ్ లో 2020, మార్చి 23వ తేదీన 90 మంది రాగా..మార్చి 24వ తేదీన 170 మంది వచ్చారన్నారు.

నిజాముద్దీన్ ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి ఉందని..50 మంది సామర్థ్యం ఉంటే..మార్చి 23వ తేదీ ఉదయం 105 మంది, మార్చి 24న 119 మంది ఉన్నారని వెల్లడించారు. నగరం అంతటా..234 ఆశ్రయాల్లో 7 వేల మంది ఉన్నారని, ఈ ఆశ్రయాల్లో మొత్తం 18 వేల 538 మందికి వసతి కల్పించవచ్చన్నారు బిపిన్ రాయ్. 

హోమ్ షెల్టర్స్ వద్ద ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, అంతేగాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది. 
 

See Also | లాక్ డౌన్ : కార్మికులను కప్పగంతులు వేయించిన కానిస్టేబుల్