India-China Clash: దేశంలో 3,560 చైనా డైరెక్టర్లు.. చైనాపై రాహుల్ కామెంట్ల అనంతరం కాంగ్రెస్

చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. యుద్ధం చేయడం కోసం చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. కానీ భారత ప్రభుత్వం నిద్రలో ఉంది

India-China Clash: దేశంలో 3,560 చైనా డైరెక్టర్లు.. చైనాపై రాహుల్ కామెంట్ల అనంతరం కాంగ్రెస్

3,560 Indian cos have Chinese directors: Chowdhury

India-China Clash: చైనా యుద్ధానికి సిద్ధమవుతుంటే నరేంద్రమోదీ ప్రభుత్వం నిద్రపోతుందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని లేపాయి. అధికార భారతీయ జనతా పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నెహ్రూ సమయంలోని తప్పిదాలు అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లోక్‭సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరి మరో అంశాన్ని లేవనెత్తారు. అరుణాచల్ ప్రదేశ్, లధాఖ్ ప్రాంతాల్లో చైనా ఆకృత్యాలకు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి బదులు వారి వ్యాపారానికి సహకరిస్తోందని ఆరోపించారు. భారత దేశంలోని 3,560 కంపెనీలకు చైనీయులు డైరెక్టర్లుగా ఉన్నారని అధిర్ రంజన్ అన్నారు.

Macherla High Tension : మాచర్లలో టెన్షన్ టెన్షన్.. టీడీపీ, వైసీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ

‘‘మోదీ ప్రభుత్వం బయటికి చాలానే మాట్లాడుతున్నప్పటికీ వాస్తవంలో జరిగేది వేరే. అరుణాచల్ ప్రదేశ్, లధాఖ్ ప్రాంతాల్లో చైనా ఆకృత్యాలకు ప్రభుత్వం సమాధానం చెప్పడానికి బదులు వారి వ్యాపారానికి సహకరిస్తోంది. 3,560 భారత కంపెనీలకు చైనీయులు డైరెక్టర్లుగా ఉన్నారు. చైనాకు భారత్ చెప్పే సమాధానం ఇదేనా? ముందు వీటి సంగతేంటో చూడాలి’’ అని అధిర్ రంజన్ చౌదరి అన్నారు.

Rs 500 Notes In Kurkure : ఇదేందయ్యా ఇది.. కుర్ కురే ప్యాకెట్లలో రూ.500 నోట్లు..! కొనేందుకు ఎగబడ్డ జనాలు

‘‘చైనా నుంచి మనకు ఉన్న ముప్పు గురించి నేను చాలా స్పష్టంగా చెప్పదల్చుకున్నాను. నేను మూడేళ్లుగా ఈ విషయాన్ని చెబుతున్నప్పటికీ ప్రభుత్వం దీన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది. ఈ ముప్పును ప్రభుత్వం పట్టించుకోవడం లేదో, లేదంటే దాస్తోందో తెలియట్లేదు. యుద్ధం చేయడం కోసం చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. కానీ భారత ప్రభుత్వం నిద్రలో ఉంది’’ అని భారత్ జోడో యాత్ర 100వ రోజు సందర్భంగా రాజస్తాన్ రాజధాని జైపూర్‭లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ అన్నారు.