ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

ఇండిపెండెంట్ అభ్యర్థుల కొత్త గుర్తులివే

ఢిల్లీ  : పార్లమెంట్ ఎన్నికల్లో  ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం ఎన్నికల సంఘం కొత్తగా 36 గుర్తులను కేటాయించింది.  అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేయగానే..ఎన్నికల అధికారులు గుర్తుల జాబితాను అందజేయనున్నారు.  నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులు తమకు కావాల్సిన గుర్తులను రిటర్నింగ్ అధికారికి సూచించాల్సి ఉండగా..ఎటువంటి అభ్యంతరాలు గానీ.. పోటీ గానీ లేకుంటే ఆయా గుర్తులను అభ్యర్థులకు కేటాయిస్తారు. కాగా గుర్తింపు పొందిన మరో 44 పార్టీలకు గుర్తులను అధికారులు ఖరారు  చేశారు.
Read Also : వైసీపీది నేరగాళ్ళ ప్రకటన : టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు

కొత్త గుర్తులు ఇవే.. 
ఆపిల్, గన్నా కిసాన్, హెలికాప్టర్, బూర ఊదుతున్న మనిషి, బ్రెడ్ టోస్టర్, సీసీటీవీ కెమెరా, కంప్యూటర్, కంప్యూటర్ మౌస్, డోర్ హ్యాండిల్, చెవిరింగులు, ఫుట్‌బాల్, అల్లం, లేడిపర్సు, తోపుడుబండి, హవర్ గ్లాసు, పనసపండు, కేతిరి, ఫుట్‌బాల్ ఆటగాడు, కిచెన్ సింక్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, టీవీ రిమోట్, రోబో, రబ్బర్‌స్టాంపు, పడవ, సితార్, షట్టర్, సోపా, స్పానర్, వికెట్లు (స్టంప్స్), స్విచ్చుబోర్డు, జావెలిన్ త్రో విసురుతున్న వ్యక్తి, ట్యూబులైటు, వాటర్‌ట్యాంక్, వెదురు చాట (విన్నోవర్) వంటి గుర్తులను ఎన్నికల సంఘం అధికారులు కేటాయించారు.
Read Also : వైసీపీ నుంచి టీడీపీ గూటికి మాజీ ఎమ్మెల్యే

×