Doctors Corona Positive: ఒకే ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు.

Doctors Corona Positive: ఒకే ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్

New Project (34)

Doctors Corona Positive: ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు. మిగతా 32 మంది హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు.

ఇక ఆసుపత్రిలో మరికొందరు డాక్టర్లకు కూడా కరోనా లక్షణాలు ఉన్నట్లు సమాచారం. వీరికి శుక్రవారం పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఆసుపత్రిలో పెద్ద సంఖ్యలో కరోనా రోగులు ఉన్నారు. కరోనా రోగులకు ఈ 37 మంది వైద్యులు, వైద్య సేవలు అందించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. కరోనా సోకిన వైద్యులందరు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారే.

ఇక ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల అధికంగా ఉంది. గడిచిన 24 గంటల్లో 7,437 కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా 24 మంది మృతి చెందారు. దీంతో ఢిల్లీలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,157 చేరింది. నాలుగున్నర నెలల తర్వాత ఇక్కడ ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.

గతేడాది నవంబర్ 19 న 7,546 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గురువారమే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇక 24 గంటల్లో 91,170 నమూనాలను పరీక్షించారు. వీరిలో 8.10 శాతం మందికి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. కేసుల పెరుగుదలపై ఢిల్లీ ఆరోగ్యశాఖామంత్రి సత్యేందర్ జైన్ మాట్లాడుతూ కేసుల పెరుగుదల ఇలానే కొనసాగితే గతంలో ఒకరోజులో నమోదైన అత్యధిక కేసుల కంటే సెకండ్ వేవ్ లో ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.

ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వివరించారు. మాస్కు లేకుండా బయటకు రాకూడదని, పోలీసులు మాస్కు లేనివారికి జరిమానా విధించాలని తెలిపారు జైన్.