Lightning in UP: పిడుగుపడి 40మంది మృతి

పిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు.

Lightning in UP: పిడుగుపడి 40మంది మృతి

Lightining Strike

Lightning In UP: పిడుగుపడి మహిళలు, పిల్లలతో సహా దాదాపు 40మంది చనిపోయినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఆదివారం పడిన వర్షంతో పాటు పలు చోట్ల పిడుగులు పడి చాలా మంది మృత్యువాతకు గురయ్యారు. ఈ ఘటనలో నష్టపోయిన వారి కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.5లక్షల చొప్పన నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

వర్షం కారణంగా ఇళ్లు లేకుండాపోయిన వారికి ఆర్థిక సాయం కూడా అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయని వారిలో మహిళలు, పిల్లలే ఎక్కువగా ఉంటున్నారని అన్నారు.

అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్)లో 14మృతులు సంభవించగా, కాన్పూర్, ఫతేపూర్ లలో ఐదుగురు చొప్పున చనిపోయారు. కౌశంబిలో పిడుగు కారణంగా నలుగురు.. ఫిరోజాబాద్, ఉన్నావో, రాయ్ బరేలీలో ఇద్దరు చొప్పన చనిపోగా, హర్దోయ్, ఝాన్సీ జిల్లాల్లో ఒకరు చొప్పున చనిపోయారు.

జరిగిన ప్రాణ నష్టంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. దీనిపై పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించేందుకు నిధులు విడుదల చేశారు. శనివారం నమోదైన వర్షం కారణంగా యూపీ, రాజస్థాన్ లలో 20మంది చనిపోయారు.