Corona Cases Kerala : కేరళలో 24 గంటల్లో 37,190 కరోనా కేసులు

కేరళలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37, 190 కరోనా కేసులు నమోదయ్యాయి.

Corona Cases Kerala : కేరళలో 24 గంటల్లో 37,190 కరోనా కేసులు

37190 Corona Cases In 24 Hours In Kerala

corona cases in Kerala : కేరళలో రికార్డుస్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 37, 190 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే 57 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,56,872 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 5,507 మంది కరోనా బారిన పడి మరణించారు.

అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో తన ప్రమాణస్వీకార విషయం పినరయి విజయన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మే-20 తర్వాతే పినరయి విజయన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణాస్వీకార కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్లు తెలుస్తోంది.

మే 17న మంత్రుల జాబితా ఖరారు చేయనున్నట్లు సమాచారం. కరోనా రెండోదశ వ్యాప్తి నేపథ్యంలో వైరస్ నియంత్రణకే తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమి వరుసగా రెండోసారి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో పినరయి విజయన్ మరోసారి సీఎం పగ్గాలు చేపట్టనున్నారు.

అధికార ఎల్​డీఎఫ్ 99 స్థానాల్లో గెలుపొంది రెండోసారి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ సారథ్యంలో యూడీఎఫ్​ 41 స్థానాలకే పరిమితమైంది. భాజపా ఖాతా తెరవలేకపోయింది.