39 International Travelers Corona : భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా

భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

39 International Travelers Corona : భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా

CORONA

39 International Travelers Corona : కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. చైనా, జపాన్ సహా పలు దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా గురువారం ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించనున్నారు. ఇటీవల జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సుమారు 6 వేల మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించారు. ఎయిర్ పోర్టులో వచ్చి వళ్లే ప్రయాణికులందరికీ ర్యాండమ్ గా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tamil Nadu: చైనా నుంచి తమిళనాడు వచ్చిన తల్లీకూతురుకు కరోనా.. అప్రమత్తమైన అధికారులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 188 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దేశంలో మొత్తం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,468కి పెరిగాయి. అయితే ఒక్కరోజే 141 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. చైనా, అమెరికా, బ్రిటన్, జపాన్ వంటి దేశాల్లో కరోనా వ్యాప్తి ఊపందుకున్న క్రమంలో భారత్ అప్రమత్తమైంది. భారత్ లోనూ కేసులు అదుపులోనే ఉన్నాయని చెబుతున్నా కొత్త కేసులు పెరుగుతున్నాయి. అయితే పలు దేశాలతో పోల్చితే భారత్ లో మెరుగైన పరిస్థితులు ఉన్నాయని చెప్పవచ్చు.