COVID-19 in india : దేశంలో కొత్తగా 39,097 క‌రోనా కేసులు..546 మరణాలు

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది.

COVID-19 in india : దేశంలో కొత్తగా 39,097 క‌రోనా కేసులు..546 మరణాలు

39097 new corona cases in India: దేశంలో కరోనా తగ్గుముఖం పట్టిన క్రమంలో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంట్లో భాగంగానే శుక్రవారం (జులై 23,2021) 39,097 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,13,32,159కు చేరింది. అలాగే, నిన్న 35,087 మంది కోలుకోగా 546మంది ప్రాణాలు కోల్పోయారు.

శుక్రవారం ఒక్కరోజే 546 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో కరోనాతో చనిపోయివారి సంఖ్య మొత్తం 4,20,016కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,05,03,166 మంది కోలుకున్నారు. 4,08,977 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 42,78,82,261 వ్యాక్సిన్ డోసులు వేశారు.

అలాగే తెలంగాణలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్న క్రమంలో 643 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,20,530 కరోనా పరీక్షలు చేయగా వారిలో 643 కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77, కరీంనగర్ జిల్లాలో 68, ఖమ్మం జిల్లాలో 57, వరంగల్ అర్బన్ జిల్లాలో 54 కొత్త కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 767 మంది కరోనా నుంచి కోలుకోగా, నలుగురు మృతి చెందారు. ఈ మరణాలతో కలిపి కరోనా మృతుల సంఖ్య 3,778కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 6,40,012 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా…. 6,26,505 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9,729 మంది చికిత్స పొందుతున్నారు.