Covid 3rd Wave: మూడో వేవ్ పొంచి ఉంది.. వాటిని వాయిదా వేసుకోండి

కొవిడ్ మహమ్మారిని నిర్లక్ష్య పెట్టి ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని.. వైరస్ ప్రభావం అప్పుడే పోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

Covid 3rd Wave: మూడో వేవ్ పొంచి ఉంది.. వాటిని వాయిదా వేసుకోండి

Covid 19 Wave

Covid 3rd Wave: కొవిడ్ మహమ్మారిని నిర్లక్ష్య పెట్టి ప్రజలు ప్రవర్తిస్తున్న తీరుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. కోవిడ్ నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారని.. వైరస్ ప్రభావం అప్పుడే పోలేదని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ క్రమంలోనే మూడో దశ ముప్పు పొంచి ఉందనే విషయాన్ని గుర్తుంచుకుని కొవిడ్ నిబంధనల పట్ల అలసత్వం చూపించకుండా పాటించాలని సూచించింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాక్షణ్ తీసుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని చెప్పింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ). కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలో ప్రజలు, అధికార యంత్రాంగాలు వ్యవహరిస్తోన్న తీరు తీవ్రంగా బాధిస్తోంది. కొవిడ్ నియమావళిని పాటించకుండా.. గుంపులుగా చేరుతున్నారు.

అలాంటి చర్యల పట్ల ప్రభుత్వాలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. విహార, ఆధ్యాత్మిక యాత్రలు అవసరమైనప్పటికీ మరికొద్ది నెలల పాటు వేచి ఉండాల్సిన సమయం ఇది. కరోనా వ్యాక్సినేషన్ తీసుకోకుండా చేరుతున్న జన సమూహాలు.. మూడో దఫా విజృంభణకు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే అవకాశం ఉందనేది తెలుసుకోవాలి. రెండుమూడు నెలల పాటు కోవిడ్ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి.

కొవిడ్ ను కట్టడి చేయాలంటే వ్యాక్సినేషన్, సామాజిక దూరం తప్పనిసరి అని చెప్పింది ఐఎంఏ.