Covid 3rd Wave : ప్రజల తీరుపై కేంద్రం తీవ్ర వ్యాఖ్యలు..థర్డ్ వేవ్ హెచ్చరికలను వెదర్ అప్ డేట్ లా తేలికగా తీసుకుంటున్నారు

దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది.

Covid 3rd Wave : ప్రజల తీరుపై కేంద్రం తీవ్ర వ్యాఖ్యలు..థర్డ్ వేవ్ హెచ్చరికలను వెదర్ అప్ డేట్ లా తేలికగా తీసుకుంటున్నారు

Agarwal

Covid3rd Wave దేశవ్యాప్తంగా చాలా మంది కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి విచ్చలవిడిగా తిరుగుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. దేశమంత‌టా మార్కెట్లలో ర‌ద్దీ, సిమ్లా, మ‌నాలి, ముస్సోరి వంటి హిల్ స్టేష‌న్ల‌లో ప‌ర్యాట‌కుల సంద‌డిని ప్ర‌స్తావిస్తూ క‌రోనా నిబంధ‌న‌లకు తిలోద‌కాలు ఇస్తే వైర‌స్‌ పై ఇప్ప‌టివ‌ర‌కూ మ‌నం చేసిన పోరాటం వృధా అవుతుంద‌ని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ హెచ్చ‌రించారు.

థ‌ర్డ్ వేవ్ గురించి తాము మాట్లాడుతుంటే ప్ర‌జ‌లు దాన్ని వాతావ‌ర‌ణ అప్‌డేట్‌ గా(weather update) తేలిక‌గా తీసుకుంటున్నార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న పర్యాటకులు.. 2 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటికొచ్చినట్లు ఉంది అని వ్యాఖ్యానిస్తున్నట్లు పలు న్యూస్ రిపోర్ట్ లు వస్తున్నాయన్నారు. మరిన్ని వేవ్​లు రాకుండా ముందుజాగ్రత్తలు పాటించాలనే ధ్యాసలో ప్రజలు లేకపోవడం బాధాకరమని తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించకుండా తిరుగుతున్న పర్యాటకులు.. 2 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటికొచ్చినట్లు ఉంది అని వ్యాఖ్యానిస్తున్నట్లు పలు న్యూస్ రిపోర్ట్ లు వస్తున్నాయన్నారు. 11 రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపామని..కోవిడ్ నిర్వహణలో ఆ రాష్ట్రాలకు వాళ్లు సాయమందిస్తారని లవ్ అగర్వాల్ చెప్పారు.

ఇదే అంశంపై మాట్లాడిన నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కోవిడ్ థర్డ్ వేవ్ పరిస్థితులు చూశామని..భారత్​లో ఈ పరిస్థితులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలకే ఉందని గుర్తుచేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ దేశంలో ఎప్పుడొస్తుండనే దానిపై చర్చించడానికి బదులుగా థర్డ్ వేవ్ రాకుండా చూడటంపై ధృష్టి సారించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇవాళ సృష్టంగా చెప్పారని వీకే పాల్ తెలిపారు.

ఇక, దేశంలో జులైలో నమోదవుతున్న కేసుల్లో.. 73.4 శాతం కేసులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచే ఉన్నాయని లవ్ అగర్వాల్​ పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో కొవిడ్‌-19 పరిస్థితి ఇంకా ఆందోళ‌న‌క‌రంగానే ఉంద‌ని తెలిపారు. దేశంలోని 55 జిల్లాల్లో ఇప్పటికీ 10కిపైగా కోవిడ్ పాజిటివిటీ రేటు ఉందని అగర్వాల్ తెలిపారు.