కేకులు చేసి..అమ్మి పోలీసులకు రూ.50వేలు విరాళం ఇచ్చిన మూడేళ్ల బుడతడు

  • Published By: nagamani ,Published On : May 14, 2020 / 06:17 AM IST
కేకులు చేసి..అమ్మి పోలీసులకు రూ.50వేలు విరాళం ఇచ్చిన మూడేళ్ల బుడతడు

మూడేళ్ల వయస్సుకే అతి పెద్ద మనస్సును చూపించాడు ఓ చిన్నారి. మూడు ఏళ్ల వయస్సంటే అమ్మానాన్నలతో ఆటలు తప్ప ఏమీ తెలియని పసిమనస్సు. అంత చిన్న పిల్లాడు చేసిన పనికి పోలీసులు సైతం ప్రశంసించారు. అమ్మ చేతితో గోరుముద్దలు తిని ఆడుకునే వయస్సున ఆ బాలుడు కేకులు తయారు చేశాడు. అంతేకాదు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుల్ని ముంబై పోలీసులకు విరాళంగా ఇచ్చాడు. ఆ చిన్నారి గురించి మనం కూడా తెలుసుకుందాం. 

ఈ బుల్లి సూపర్ స్టార్ పేరు కబీర్. ముంబైలో అమ్మానాన్నలతో ఉంటాడు. అమ్మపేరు కరిష్మా. నాన్న పేరు కేశవ్. తల్లిదండ్రుల సహాయంతో కబీర్ బుట్టెడు కేకులు తయారు చేశాడు. వాటిని కష్టపడి అమ్మాడు. అలా రూ.10వేలు సంపాదిద్దామనుకున్నాడు. కానీ ఆ చిన్నారి మంచి ఆలోచనను అర్థం చేసుకున్న పలువురు  కేకులు కొనటానికి ముందుకు రావటంతో అనుకున్నదానికి కంటే నాలుగు రెట్లు ఎక్కువగానే సంపాదించాడు. అంటే మొత్తం రూ.50వేలు సంపాదించాడు. దానికి సంబంధించిన చెక్కును మంగళవారం (మే 12,2020)న ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బిర్ సింగ్ గు తల్లిదండ్రులతో కలిసి వచ్చి చెక్కును అంజేశాడు. చెక్కుతో పాటు కబీర్ తయారు చేసిన కేకుల బాక్సును కూడా ఇచ్చాడు. 

రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ముంబైలో పోలీసులు ప్రజల కోసం నిర్విరామంగా చేస్తున్న సేవలకు ముంబై పోలీసులు ఈ విరాళాన్ని ఇస్తున్నట్లుగా చెప్పారు. అది విన్న పోలీసులు కబీర్ ను ప్రశంసించారు. 

 కబీర్ ఇచ్చిన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు ముంబై పోలీసులు ఆశ్చర్యపోయారు. ఆనందపడ్డారు. ప్రశంసలతో ముంచెత్తారు. ఆశీర్వదించారు. చిన్నారి కబీర్ ఇచ్చిన ఈ విరాళం చాలా అమూల్యమైన..అద్భుతమైనది..కబీర్ తయారు చేసిన కేకుల రుచిని మేము ఎన్నటికీ మరచిపోలేము..సూపర్ గా ఉన్నాయి. ఆ రుచి నా నోటిని ఎప్పటికీ విడువదు..ఆ సహాయం మనస్సులో ఎప్పటికీ ఉంటుందంటూ ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఆ బాలుడి పెద్ద మనసుకు ఫిదా అవుతున్నారు. అంత కష్టపడి సంపాదించిన మొత్తాన్ని విరాళంగా ఇవ్వడం నిజంగా గ్రేట్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.