Internet Shutdown: ప్రభుత్వ ఉద్యోగాల కోసం అర్హత పరీక్ష.. నాలుగు గంటలు బంద్ కానున్న ఇంటర్నెట్

అసోంలో జరగబోతున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్ష సందర్భంగా అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోనున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు అంటే నాలుగు గంటలపాటు ఇంటర్నెట్ సేవలను ఆపేస్తారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి.

Internet Shutdown: ఈ మధ్య పరీక్షల్లో కాపీయింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. కొందరు కేటుగాళ్లు లేటెస్ట్ టెక్నాలజీ వాడి కాపీ కొడుతున్నారు. ఇటీవల ఒక పరీక్ష కోసం అభ్యర్థి విగ్గులోపల ఎలక్ట్రానిక్ డివైజ్ పెట్టుకుని దొరికిపోయిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ఇలాంటి కాపీయింగ్ అడ్డుకోవడం ప్రభుత్వాలకు కత్తిమీద సాములా మారింది.

Wedding card: ట్యాబ్లెట్ షీట్ కాదు.. పెండ్లి పత్రిక.. నెటిజన్లను ఆకర్షిస్తున్న వెడ్డింగ్ కార్డ్

పరీక్షల సమయంలో కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు ఇంటర్నెట్ తీసేయాల్సి వస్తోంది. అసోంలో త్వరలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పరీక్ష జరగబోతుంది. అసోం రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ పేరుతో జరగబోతున్న ఈ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 27,000 ఉద్యోగాల్ని భర్తీ చేయబోతున్నారు. ఈ పరీక్ష జరుగుతున్నందున అన్ని జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తారు. పరీక్ష పూర్తయ్యే వరకు.. అంటే నాలుగు గంటలపాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోతాయి. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షకు దాదాపు 14 లక్షల మంది హాజరవుతారని అంచనా. పరీక్షల సందర్భంగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ విధిస్తారు.

Income tax: నగదు లావాదేవీలపై ఆదాయపు పన్ను శాఖ కన్ను.. 20 వేలు దాటితే నిషేధం

అభ్యర్థులు, ఇన్విజిలేటర్లతోపాటు నిర్వహణా సిబ్బంది మొబైల్ ఫోన్లతోపాటు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లు తెచ్చుకోవడాన్ని నిషేధించారు. ప్రతి సెంటర్‌లో పరీక్షల్ని వీడియో కూడా తీయబోతున్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 11 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్ష ద్వారా గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల్ని భర్తీ చేస్తారు.

 

ట్రెండింగ్ వార్తలు