Omicron Variant : ఒమిక్రాన్ బారిన పడిన ఆ నలుగురు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు.. వ్యాక్సిన్ తీసుకున్నారా?

దేశంలో నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూసిన విషయం విదితమే.. వారు ఎక్కడి నుంచి వచ్చారు. టీకా తీసుకున్నారా? లేదా అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం

Omicron Variant : ఒమిక్రాన్ బారిన పడిన ఆ నలుగురు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు.. వ్యాక్సిన్ తీసుకున్నారా?

Omicron Variant

Omicron Variant : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. మరికొందరి నమూనాలను పరీక్షలకు పంపారు వైద్యులు. ఒమిక్రాన్ సోకిన నలుగురు వ్యక్తుల్లో ముగ్గురు వ్యక్తులు ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక వైరస్ సోకిన వారిలో ఇద్దరు వృద్దులు ఉండగా మరో ఇద్దరు మధ్య వయసు వారు ఉన్నారు. కొత్త వేరియంట్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని వైద్యులు తెలిపారు.

చదవండి : Omicron: హైదరాబాద్‌లో మళ్లీ ఆంక్షలు.. వైరస్‌ హాట్‌స్పాట్‌లు గుర్తింపు

మొదటి ఒమిక్రాన్ కేసు.

కర్ణాటకలో మొదటి ఒమిక్రాన్ కేసు బయటపడింది. దక్షిణాఫ్రికా నుంచి నవంబర్ 20న 66ఏళ్ల వృద్ధుడు బెంగళూరు వచ్చారు. అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో నమూనాలు మళ్లీ సకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. ఈ పరీక్షలో అతడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఈ ఫలితాలు వచ్చేలోపే (నవంబర్ 27న) సదరు వ్యక్తి దుబాయ్ వెళ్ళిపోయాడు. అలెర్ట్ అయిన వైద్యులు అతడిని కలిసిన వారికి పరీక్షలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఎవరికి పాజిటివ్ నిర్దారణ కాలేదు. అయితే అప్పటికే ఆ వ్యక్తి రెండు డోస్‌ల టీకా తీసుకున్నట్లు వైద్యులు గుర్తించారు.

చదవండి : Venkaiah Naidu On Omicron : ఒమిక్రాన్ గురించి ఆందోళన వద్దు…జాగ్రత్తలు తప్పనిసరి- వెంకయ్యనాయుడు

రెండవ ఒమిక్రాన్ కేసు

భారతదేశంలోని 2వ ఒమిక్రాన్ కేసు కూడా కర్ణాటకలోనే గుర్తించబడింది. 46ాఏళ్ల వ్యక్తికి కరోనా సోకడంతో అనుమానంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను పంపారు. ఇందులో అతడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. అయితే అతడికి అంతర్జాతీయ ట్రావెల్ హిస్టరీ లేదు. అతడు దేశం దాటి వెళ్లకపోయినా ఈ వేరియంట్ సోకింది. ఫిబ్రవరి నెలలోనే అతడు కరోనా టీకా తీసుకున్నారు. యాంటీ బాడీస్ తక్కువగా ఉండటంతో ఈ వేరియంట్ సోకినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే ఇతనికి ఆ వేరియంట్ ఎలా వచ్చిందనేది ఇప్పటికి నిర్దారణ కాలేదు. వైద్యవృత్తిలో ఉన్న ఇతడు నవంబర్ 20న జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సుకు హాజరయ్యారు. అక్కడే ఈ మ్యుటెంట్ సోకి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు.

చదవండి : Omicron Cases in India : భారత్‌లో 4కి చేరిన ఒమిక్రాన్ కేసులు

మూడవ కేసు..

మూడవ ఒమిక్రాన్ కేసు గుజరాత్ లో నమోదైంది. 72 ఏళ్ల వృద్ధుడికి ఓమిక్రాన్ వేరియంట్ నిర్దారణ అయింది. ఇతడు నవంబర్ 28న జింబాబ్వే వచ్చాడు.. కరోనా నిర్దారణ కావడంతో శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్ పంపారు. డిసెంబర్ 2న ఇతడికి ఒమిక్రాన్ నిర్దారణ అయింది. ఇక ఇతడికి లక్షణాల విషయానికి వస్తే గొంతు నొప్పి, బలహీనత ఉంది. ఈ వ్యక్తి చాలా ఏళ్లుగా జింబాబ్వేలో నివసిస్తున్నాడు. బంధువులను కలిసేందుకు గుజరాత్ వచ్చాడు.

చదవండి : Omicron In India : భారత్‌లో మూడవ ఒమిక్రాన్‌ కేసు నమోదు..

నాలుగవ కేసు

నాలుగవ కేసు మహారాష్ట్రలో వెలుగుచూసింది. 33 ఏళ్ల మెరైన్ ఇంజనీర్‌కు కరోనా నిర్దారణ కావడంతో అతడి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా నిర్దారణ అయింది. అయితే ఏప్రిల్ నుంచి అతడు షిప్‌లో ఉండటంతో కరోనా టీకా తీసుకోలేదు. అయితే షిప్ దక్షిణాఫ్రికా మీదుగా ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. అక్కడే ఇతడికి కొత్త వేరియంట్ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. ముందు జాగ్రత్త కోసం కళ్యాణ్‌లోని కోవిడ్ సెంటర్‌లో ఉంచారు. అయితే అతడిని కలిసిన వారికి పరీక్షలు నిర్వహించగా కరోనా నిర్దారణ కాలేదు.