శిథిలాల కింద 18 గంటలు..సురక్షతంగా బయటపడిన బాలుడు

  • Published By: madhu ,Published On : August 26, 2020 / 10:05 AM IST
శిథిలాల కింద 18 గంటలు..సురక్షతంగా బయటపడిన బాలుడు

మహారాష్ట్రలో కుప్పకూలిన భవంతి శిథిలాల కింద చిక్కుకపోయన నాలుగేళ్ల బాలుడిని 18 గంటల అనంతరం రక్షించాయి. దీనికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాయ్ ఘడ్ జిల్లాలో మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే.



సోమవారం సాయంత్రం 7 గంటల సమయంలో కూలిన భవంతి వద్ద అధికారులు సహాయక చర్యలు చేపట్టాయి. 75 మందికి పైగా శిథిలాలో చిక్కుకపోయారు. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు 60 మందిని రక్షించారు. మొత్తం 13 మంది మరణించారు.
https://10tv.in/karnatakas-singham-k-annamalai-joins-bjp-ahead-of-tamil-nadus-2021-polls/
శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు సమాచారం.
అయితే..ఓ నాలుగేళ్ల బాలుడు చిక్కుకున్నాడని రెస్క్యూ టీం గ్రహించింది. అతడిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. 18 గంటల తర్వాత..బాలుడిని బయటకు తీశారు. ఇతడి పేరు నదీమ్ బంగీగా తేలింది.



గ్యాస్ కట్టర్ల ద్వారా కాంక్రీట్ స్లాబ్ ను తొలగించి బాలుడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడిన ఆ బాలుడిని కాపాడడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేశారు. కానీ..అతని తల్లి నౌషిన్ నదీమ్, సోదరీమణులు అయేషా, రుకియా ప్రాణాలు కోల్పోయారు.
https://10tv.in/three-officers-suspended-in-the-lg-polymers-incident/
ఈ ఘటనపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబసభ్యులకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ఐదుగురిపై కేసు నమోదు చేశారు.