Madhya Pradesh : పెళ్లికి వెళ్లిన కోవిడ్ రోగి…40 మందికి వైరస్

Madhya Pradesh : పెళ్లికి వెళ్లిన కోవిడ్ రోగి…40 మందికి వైరస్

MP Village

40 Test Positive : ఒకరు చేసిన మూర్ఖత్వపు పని..ఎంతో మందికి కీడు తెచ్చింది. వైరస్ సోకిన వారు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని చెప్పినా..పెడ చెవిన పెడుతూ..ఏమవుతుందిలే..అనుకుంటూ..జనాల్లో తిరిగిపోతున్నారు. దీని కారణంగా..పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ ప్రాంతంలో వైరస్ కేసులు గణనీయంగా పెరగడంతో అధికారులు విచారణ చేపట్టారు.

కరోనా సోకిన వ్యక్తి..పెళ్లికి హాజరు కావడమేనని తేలింది. అరుణ్ మిశ్రా అనే వ్యక్తి ఏప్రిల్ 24వ తేదీన కరోనా బారిన పడ్డాడు. హోం ఐసోలేషన్ లో ఉండాలని వైద్యులు చెప్పి మందులిచ్చారు. అయితే..నివారి జిల్లాలో Luhurguva గ్రామంలో..ఏప్రిల్ 29వ తేదీన జరిగిన బంధువుల పెళ్లికి హాజరయ్యాడు. తనకు కరోనా ఉందనే విషయం చెప్పలేదు. ఒక్కడే వెళ్లకుండా..సింగ్ అనే ఫ్రెండ్ ను కూడా పెళ్లికి తీసుకెళ్లాడు.

అక్కడకు వెళ్లడమే కాకుండా..బంధువులకు భోజనం కూడా వడ్డించాడు. అయితే..ఈ ప్రాంతంలో కరోనా కేసులు ఎక్కువ పెరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై ఆరా తీస్తే..అసలు విషయం తెలిసింది. దీనిపై కేసు బుక్ చేశారు అధికారులు. Luhurguva గ్రామాన్ని సీల్ చేసి రెడ్ జోన్ గా ప్రకటించారు. మొత్తం 40 మంది వైరస్ బారిన పడ్డారని నిర్ధారించారు.

Read More : Fake Swamiji: దెయ్యం వదిలిస్తానంటూ మహిళను చిత్రహింసలు పెట్టిన స్వామిజి