Varanasi : కరోనా కల్లోలం : వ్యాక్సిన్ కొరత..41 హాస్పిటల్స్ కు తాళాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో కేసులు అధికమౌతున్నాయి.

Varanasi : కరోనా కల్లోలం : వ్యాక్సిన్ కొరత..41 హాస్పిటల్స్ కు తాళాలు

Covid Vaccination

Covid Vaccination Sites : కరోనా కల్లోలం సృష్టిస్తోంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే కొత్తగా లక్షా 15వేల 249 కొత్త కేసులు వచ్చాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల నుంచి 8 లక్షలకు పెరిగింది. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు లక్షలకు పైగా కేసులు నమోదవడం కలవరపెడుతోంది. కరోనాతో దేశంలో 630మంది బలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. సరిపడా వ్యాక్సిన్ లేకపోవడంతో కేసులు అధికమౌతున్నాయి. 41 ఆసుపత్రులను మూసివేశారు. ప్రస్తుతం 25 ఆసుపత్రుల్లో మాత్రమే టీకా ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

వారణాసి జిల్లాకు సరఫరా చేసే సెంటర్ ను కూడా మూసివేశారు. లక్నో నుంచి సరఫరా అవుతున్న టీకా క్రమంగా..జిల్లాలకు తగ్గించేశారని హెల్త్ వర్కర్ శ్యామ్ జీ ప్రసాద్ వెల్లడించారు. వారణాసిలో కొవిడ్ టీకాకు చాలా డిమాండ్ ఉందని, ఇప్పుడు టీకా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. టీకా కొరతపై నోడల్ అధికారికి సమాచారం ఇచ్చినట్లు, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదని వైద్యాధికారులు అంటున్నారు. అంతేగాకుండా..మహారాష్ట్ర, ఒడిశాలోనూ వ్యాక్సిన్ కొరత ఉంది.

Read More : Corona Patients: సీరియస్ కరోనా పేషెంట్లకే బెడ్స్