2nd Covid Wave : దిక్కుమాలిన కరోనా, కనిపించే దేవుళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు

దిక్కుమాలిన కరోనా..బారిన పడి. డాక్టర్లు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి...ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.

2nd Covid Wave : దిక్కుమాలిన కరోనా, కనిపించే దేవుళ్లు ప్రాణాలు కోల్పోతున్నారు

Ima

420 Doctors Died : డాక్టర్లు నిజమైన దేవుళ్లు.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో వీరు అందిస్తున్న సేవలు అన్నీ ఇన్నీ కావు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా..రోగుల ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే..దిక్కుమాలిన కరోనా..బారిన పడి..వారు కూడా చనిపోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో చనిపోతున్నారని తెలుస్తోంది. డాక్టర్ల మరణాలకు సంబంధించి…ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వివరాలు వెల్లడించింది.

భారతదేశంలో కరోనా సెకండ వేవ్ లో వైరస్ బారిన పడి 420 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారని, ఢిల్లీలో 100 మంది డాక్టర్లు చనిపోయిన వారిలో ఉన్నారు. మృతుల సంఖ్య రోజురోజుకు పెరగుతండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బీహార్ లో 96 మంది, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో 41 మంది వైద్యులు చనిపోయారని డాక్టర్స్ అసోసియేషన్ వెల్లడించింది.

కరోనా మొదటి వేవ్ లో 748 మంది డాక్టర్లు మృతి చెందగా..ఇప్పటి వరకు 1100 మంది డాక్టర్లు కరోనా కాటుకు బలయ్యారని అంచనా. మాజీ IMA అధ్యక్షుడు డాక్టర్ కేకే అగర్వాల్ కరోనా వైరస్ కు బలయ్యారు. ఇతని వయస్సు 65 సంవత్సరాలు. అగర్వాల్ రెండు డోసులు వేయించుకున్నారు.

ఇక భారతదేశంలో కరోనా వైరస్ విషయానికి వస్తే…వైరస్ బారిన వారి సంఖ్య రోజు రోజుకు తక్కువగా నమోదవుతోంది. కానీ మరణాల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 2,57,299 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. 4 వేల 194 మంది ప్రాణాలు కోల్పోయారు. 3, 57, 630 మంది డిశ్చార్జ్ అయ్యారు.

Read More : జూన్ 1నుంచి లాక్‌డౌన్ ఉండదు.. ఆగస్ట్ నుంచి వ్యాక్సిన్!