Covid Cases In India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 4,270 నమోదు

దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుందా.. కొవిడ్ విజృణ మరోసారి ఖాయమా అన్న భయాందోళనలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తుంది.

Covid Cases In India: భారీగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 4,270 నమోదు

Covid

Covid Cases In India: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతుందా.. కొవిడ్ విజృంభణ మరోసారి ఖాయమా అన్న భయాందోళనలు దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం ప్రజల ఆందోళనను మరింత రెట్టింపు చేస్తుంది. నిన్నమొన్నటి వరకు 2వేల నుంచి 3,500 వరకు కొత్తగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. కానీ ఆదివారం ఒక్కసారిగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. గడిచిన 24గంటల్లో 4,270 మందికి కొత్తగా కొవిడ్ సోకింది.

Covid booster : కార్బెవాక్స్‌ వ్యాక్సిన్‌ బూస్టర్‌ డోస్‌.. డీసీజీఐ అనుమతి..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. జూన్ 4న(శనివారం) 4,13,699 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. వారిలో 4,270 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో కొవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 24,054కు చేరింది. అయితే శనివారం ఒక్కరోజు కొవిడ్ వైరస్ తో చికిత్స పొందుతూ 15 మంది మృతిచెందారు. కొత్తగా 2,619 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.73శాతంగా ఉంది. మృతుల సంఖ్య 1.22 శాతంగా ఉంది. ఇక రోజువారి పాజిటివిటీ రేటు 1.30శాతంగా ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 0.44 శాతంగా నమోదైంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 4,31,76,817 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో చికిత్స పొందుతూ 5,24,692 మంది మరణించారు.

Covid in India..Mask must : భారత్ లో పెరుగుతున్న కరోనా కేసులు..ఆ రాష్ట్రంలో మళ్లీ మాస్కు నిబంధన తప్పనిసరి

దేశంలో కేరళ రాష్ట్రంలో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క శనివారం కేరళ రాష్ట్రంలో 1,544 కేసులు నమోదయ్యాయి. తరువాత స్థానంలో మహారాష్ట్ర ఉంది. మహారాష్ట్రంలో కొత్తగా 1300 కొత్తకేసులు నమోదయ్యాయి. కొవిడ్ వ్యాప్తి కట్టడికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీ చర్యలు చేపట్టాయి. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. శనివారం 11,92,427 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 194 కోట్లకు చేరింది.