Tenth Exam Results : పదో తరగతి పరీక్షలు రాసిన తండ్రీకొడుకులు.. తండ్రి పాస్, కొడుకు ఫెయిల్
టెన్త్ పరీక్షల ఫలితాలు చూసిన ఆ వ్యక్తి కుటుంబసభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.(Tenth Exam Results)

Tenth Exam Results : చదువుకి వయసుకి సంబంధం లేదంటారు. చదువుకోవాలనే ఆసక్తి ఉండాలి కానీ ఏజ్ తో పనేముంది. అనేక సందర్భాల్లో ఇది ప్రూవ్ అయ్యింది. పెద్ద వయసున్న వారు కూడా పిల్లలతో కలిసి పరీక్షలు రాయడం చాలాసార్లు చూసే ఉన్నాం. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ తండ్రి తన కొడుకుతో కలిసి టెన్త్ పరీక్షలు రాశాడు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే.. పరీక్షల్లో తండ్రి పాస్ అయ్యాడు. కొడుకు మాత్రం ఫెయిల్ అయ్యాడు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
మహారాష్ట్రంలోని పుణెకు చెందిన భాస్కర్ వాగ్మారే (43) తన కొడుకుతో కలిసి ఇటీవల టెన్త్ ఎగ్జామ్స్ రాశాడు. ఆ రిజల్ట్స్ శుక్రవారం వచ్చాయి. ఫలితాలు చూసిన కుటుంబ సభ్యులకు సంతోషించాలో లేక బాధపడాలో అర్థం కాలేదు. ఎందుకంటే తండ్రి భాస్కర్ పరీక్షల్లో పాస్ కాగా.. కొడుకు మాత్రం తప్పాడు. ఏడో తరగతి తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడంతో భాస్కర్ చదువు మానేశాడు. 30 ఏళ్ల తర్వాత తిరిగి తన కొడుకుతో కలిసి ఈ ఏడాది పది పరీక్షలకు హాజరయ్యాడు. పదో తరగతి పరీక్షల్లో భాస్కర్ పాస్ అవగా, అతని కుమారుడు ఫెయిల్ అవడంతో ఆ కుటుంబ పరిస్థితి విచిత్రంగా మారింది.(Tenth Exam Results)
భాస్కర్ కు చదువు అంటే ఆసక్తి. కానీ కుటుంబ పరిస్థితులు, ఆర్థికి స్థితిగతుల సరిగా లేక సెవెన్త్ క్లాస్ వరకు చదువుకుని ఆపేశాడు. తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడటంతో పూర్తిగా చదువుకి దూరమయ్యాడు. అయితే మళ్లీ చదువుకుని పదో తరగతి పాస్ కావాలని భాస్కర్ నిర్ణయించుకున్నాడు. తన కుమారుడు కూడా ఇదే ఏడాది పదో తరగతి పరీక్షలు రాస్తుండటం అతనికి కలిసొచ్చింది. కొడుకుతో కలిసి నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యేవాడు. అలా ఎంతో కష్టపడి పది పరీక్షలు రాసి పాసయ్యాడు.
‘పెద్ద చదువులు చదువుకోవాలని నాకు ముందు నుంచీ ఉండేది. కానీ, కుటుంబ బాధ్యతల వల్ల కుదరలేదు. కొంతకాలం నుంచి తిరిగి చదువుకోవాలని అనిపించింది. కొన్ని కోర్సులు చేయడం వల్ల మరింత సంపాదించొచ్చనే ఆలోచన కలిగింది. అందుకే పదో తరగతి పరీక్షలు రాయాలని నిర్ణయించుకున్నా. నా కొడుకు కూడా ఈ ఏడాదే పరీక్షలు రాశాడు. నేను పాస్ అయినందుకు సంతోషంగానే ఉన్నప్పటికీ.. కొడుకు ఫెయిల్ కావడం మాత్రం బాధిస్తోంది. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాసయ్యేలా కొడుక్కి సహకారం అందిస్తా. ఈసారి తప్పకుండా నా కుమారుడు పాస్ అవుతాడు’ అని తండ్రి భాస్కర్ నమ్మకంగా చెప్పాడు.
Viral Video: లక్షలాది కప్ప పిల్లల సైన్యాన్ని మీరెప్పుడైనా చూశారా.. ఒళ్లు గగ్గురు పొడిచే వీడియో
కాగా, చదువుకి వయసుతో సంబంధం లేదని భాస్కర్ మరోసారి నిరూపించాడు. చదువుకోవాలనే ఆసక్తి, పట్టుదల ఉండాలే కానీ.. ఏజ్ తో పనేముందని ఆయన అంటున్నారు. లేట్ వయసులో ఎంతో పట్టుదలతో కష్టపడి చదువుకుని టెన్త్ పరీక్షల్లో పాస్ అయిన భాస్కర్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
- Telangana : తెలంగాణలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు జారీ
- Daughter : అమ్మాయి పుట్టడంతో ఆనందపడుతున్న కుటుంబం..పసిపాపను హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చిన తండ్రి
- Maharashtra : 60 వేల మందికి చుక్కలు చూపించిన పిల్లి..! ఏకంగా రూ.100 కోట్ల నష్టం..!!
- Maharashtra : రైతుల భక్తి.. 2,000 కిలోల ద్రాక్షపండ్లతో గణేషుడికి అలంకరణ
- World Record Titles: ప్రపంచ రికార్డులు తెచ్చిపెట్టిన 100 కేజీల వెజిటేరియన్ కేక్
1చాలా తెలివిగా అంబానీ వీలునామా
2Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు
3స్పేస్‌లో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు
416వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల
5ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో డబ్బులు మాయం
6ఎన్టీఆర్ వారసుడు జూ.ఎన్టీఆర్.. అల్లుళ్లు వారసులు కాలేరు!
7IPL Tournament : గుడ్‌న్యూస్.. ఐపీఎల్ ఇకపై రెండున్నర నెలలు.. ఫ్యాన్స్‌కు పండుగే..!
8NTR: అభిమానికి తారక్ ధీమా.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
9Actress Swara Bhaskar : చంపేస్తామని నటి స్వర భాస్కర్‌కు బెదిరింపు లేఖ
10Jasprit Bumrah: భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్‌కి 35 ఏళ్ళ తర్వాత తొలిసారి ఛాన్స్..
-
Samantha: యశోద.. ఆ రోజున రాదా..?
-
KA Paul : కేసీఆర్, మోదీ ఇద్దరూ తోడు దొంగలే : కేఏ.పాల్
-
Konchem Hatke: ‘కొంచెం హట్కే’గా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్!
-
Minister Roja : చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా విమర్శలు
-
Samsung : శాంసంగ్ నుంచి కొత్త గెలాక్సీ M సిరీస్ ఫోన్.. జూలై 5నే లాంచ్..!
-
Virata Parvam: 15 రోజులకే విరాటపర్వం ఔట్!
-
Kodali Nani : చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
-
Happy Birthday Movie: హ్యాపీ బర్త్‌డే ట్రైలర్.. కామెడీతో అరాచకం!