corona cases : దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా…ఒక్కరోజులో 43,846 కేసులు నమోదు

దేశంలో కరోనా మరోసారి పడగ విప్పింది. పల్లె , పట్నం తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో మరోసారి దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి.

corona cases : దేశవ్యాప్తంగా విజృంభిస్తోన్న కరోనా…ఒక్కరోజులో 43,846 కేసులు నమోదు

43846 Corona Cases Registered In A Single Day Across India1

increasing corona cases : దేశంలో కరోనా మరోసారి పడగ విప్పింది. పల్లె , పట్నం తేడా లేకుండా విజృంభిస్తోంది. దీంతో రికార్డు స్థాయిలో మరోసారి దేశ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 43 వేల 846 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. కాగా గడిచిన 24 గంటల్లో 197 మంది చనిపోయారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గత పది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల్లోనే లక్ష కొత్త కేసులు వచ్చాయి.

మహారాష్ట్రలో కరోనా ఉగ్ర రూపం దాల్చింది. ఆరు నెలల తరువాత గరిష్ట స్థాయిలో అక్కడ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలో 27 వేల 126 కేసులు నమోదవ్వగా 92 మంది మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ ఒక లక్షా 91 వేల 6 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 63 శాతం పైగా కేసులు మహారాష్ట్ర నుంచే వస్తున్నాయి.

ఇప్పటి వరకు మహరాష్ట్రలో 24 లక్షల 49 వేల 147 కేసులు నమోదవగా 53 వేల 300 మంది చనిపోయారు. కరోనా దెబ్బకు 9 జిల్లాల్లో లాక్‌డౌన్, నైట్‌ కర్ఫ్యూ వంటి కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కోవిడ్‌ వ్యాప్తి అడ్డుకునేందుకు ముంబై కార్పొరేషన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నాగ్ పూర్ లో లాక్ డౌన్ అమలవుతున్నాయి.

కరోనా హాట్ స్పాట్ ప్రాంతాల్లో స్కూల్స్ మూసివేశారు. పుణే, లాతూర్ జిల్లాల్లో వారాంతపు లాక్ డౌన్‌, నైట్ కర్ఫ్యూ విధించారు. మార్చి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ ఆంక్షలు విధించారు. ముంబై వచ్చే వారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేసింది బీఎంసీ. రద్దీ ప్రాంతాల్లో యాంటిజెన్ టెస్టులు నిర్వహిస్తోంది బీఎంసీ. టెస్టులకు నిరాకరిస్తే ఎపిడిమిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకోనున్నారు.