India : 24 గంటల్లో 44 వేల 111 కేసులు

భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.

India : 24 గంటల్లో 44 వేల 111 కేసులు

India Covid

India Covid : భారతదేశంలో కరోనా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కొత్తగా 44 వేల 111 మంది వైరస్ బారిన పడ్డారు. గత 24 గంటల్లో 44 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 34.46 కోట్లు వ్యాక్సినేషన్ వేయడం జరిగిందని ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఒక్క రోజులో 738 మంది చనిపోయారు. నాలుగు లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. యూఎస్, బ్రెజిల్ తర్వాత..భారతదేశం మూడోస్థానంలో నిలిచింది.

యాక్టివ్ కోవిడ్ కేసులు 4.95 లక్షలు ఉండగా..97 రోజుల తర్వాత..5 లక్షలకన్నా తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో 54 వేల మంది రోగులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 2.96 కోట్ల మంది రికవరీ అయ్యారు. రికవరీ రేటు 97.06గా ఉంది. రోజువారి పాజిటివిటీ రేటు 2.35 శాతంగా నమోదైంది. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కంటే తక్కువగా నమోదవుతే..సేఫ్ జోన్ పరిధిలో ఉన్నట్లు డబ్ల్యూహెచ్ వో వెల్లడించిన సంగతి తెలిసిందే.

గర్భిణీ స్త్రీలు కూడా ఇప్పుడు వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే..టీకా కేంద్రాలను సందర్శించవచ్చని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గత నెల వరకు పాలిచ్చే మహిళలు టీకా వేయించుకొనేందుకు వీలు కల్పించేది. ఇప్పుడు గర్భిణీ స్త్రీలకు అవకాశం కల్పించారు.