Corona vaccine : 45 ఏళ్లు నిండాయా..ఏప్రిల్ 01 నుంచి కరోనా టీకా

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది...దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది...

Corona vaccine : 45 ఏళ్లు నిండాయా..ఏప్రిల్ 01 నుంచి కరోనా టీకా

COVID vaccination

45 years : దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 60ఏళ్ల వారికే అనుమతి ఉండగా, 2021, ఏప్రిల్ 01వ తేదీ గురువారం నుంచి 45 ఏళ్లు పైబడిన వారికి కూడా వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇక ప్రైవేటు కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందించడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 48.39శాతం టీకాలు ప్రైవేటు కేంద్రాల్లోనే అందించినట్లు పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీ 43.11శాతంతో రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.

దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకు 57లక్షల డోసులను అందించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తర్వాతి స్థానాల్లో రాజస్థాన్‌ 54.84లక్షలు, ఉత్తర్‌ప్రదేశ్‌ 53.03లక్షలు, గుజరాత్‌ 52.62లక్షలతో ఉన్నాయని తెలిపింది. ఏపీలో 24లక్షలు, తెలంగాణలో 11లక్షల 75వేల డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న వేళ కొత్తరకం కరోనా కేసులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌ వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో 11వేల 64 నమూనాలకు జీనోమ్‌ సీక్సెన్స్‌ నిర్వహించగా వీటిలో 855 కొత్తరకం కేసులు బయటపడినట్లు తెలిపారు. వీటిలో 807 బ్రిటన్‌ రకాలు, 47 దక్షిణాఫ్రికా రకం, మరొక నమూనాలో బ్రెజిల్‌ రకం కరోనాను గుర్తించినట్లు పేర్కొన్నారు.

దేశ రాజధాని ఢిల్లీతో పాటు, కర్ణాటక క్యాపిటల్‌ బెంగళూరులో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకీ తీవ్ర స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గత రెండు వారాలుగా కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. కొవిడ్‌ కేసులు భారీగా పెరగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలు కూడా నిండిపోయాయి. క్రిటికల్‌గా ఉన్న కొవిడ్‌ పేషెంట్లను ప్రైవేట్‌ ఆసుపత్రులు.. ప్రభుత్వ హాస్పిటల్‌కు రిఫర్‌ చేస్తున్నాయని.. దీంతో పేషెంట్ల సంఖ్య మరింత ఎక్కువ అవుతోందని అధికారులు తెలిపారు. దీంతో బెడ్‌ల సంఖ్యను మరింత పెంచుతున్నామన్నారు.

మొదటి దశ కరోనా సమయంలో పేషెంట్ల సంఖ్య ఇంత ఎక్కువ లేదని తెలిపారు వైద్యాధికారులు. లాక్‌డౌన్‌ కారణంగా కరోనా బారిన పడ్డ వారు తక్కువగానే ఉండేవారని.. ప్రస్తుతం కోవిడ్‌తో పాటు ఇతర జబ్బుల వారు కూడా ఆసుపత్రులకు రావడంతో కిక్కిరిస్తున్నాయన్నారు. 50ఏళ్ల నుంచి 70ఏళ్ల మధ్య పేషెంట్లే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.. ఢిల్లీ, బెంగళూరు వైద్యాధికారులు. మార్చి మొదటి వారం నుంచి కేసుల సంఖ్య పెరగడాన్ని గమనించామన్నారు. తమపై ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. రెండవ వేవ్‌ను తట్టుకోవడానికి సన్నద్ధమయ్యామన్నారు.