Covid : కరోనా లేదు, అయినా..బ్లాక్ ఫంగస్..ఎలా వచ్చిందో

బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు చెందుతున్నారు. కరోనా వైరస్ కు డయబెటిస్ కు దగ్గరి సంబంధం ఉందనే సంగతి తెలిసిందే. కరోనా వచ్చి...తగ్గిపోయిన డయాబెటిక్ రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతోంది.

Covid : కరోనా లేదు, అయినా..బ్లాక్ ఫంగస్..ఎలా వచ్చిందో

Covid Black

Mucormycosis Cases : బ్లాక్ ఫంగస్ కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు చెందుతున్నారు. కరోనా వైరస్ కు డయబెటిస్ కు దగ్గరి సంబంధం ఉందనే సంగతి తెలిసిందే. కరోనా వచ్చి…తగ్గిపోయిన డయాబెటిక్ రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతోంది. వ్యాధినిరోధక శక్తి బాగా తగ్గిపోయి…బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతోంది. కరోనా వైరస్ సోకకుండా బ్లాక్ ఫంగస్ బారిన పడడం అత్యంత అరుదుగా వైద్యులు భావించారు. కానీ వైరస్ సోకకుండానే…బ్లాక్ ఫంగస్ బారిన పడడం వైద్యులను కలవరపెడుతోంది. అసలు బ్లాక్ పంగస్ వారికి ఎలా వచ్చిందనే దానిపై అధ్యయనం చేస్తున్నారు.

Read More : PV Sindhu : స్వర్ణ పతాకంపై గురి, క్వార్టర్స్‌‌కు దూసుకెళ్లిన సింధు

కరోనా సెకండ్ వేవ్ తర్వాత మొత్తం మూడు నెలల వ్యవధిలో జైపూర్ లో 3 వేల 471 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అందులో 477 మందికి అసలు కరోనా వైరస్ సోకలేదని వెల్లడైంది. అంటే..మొత్తం బ్లాక్ ఫంగస్ కేసుల్లో 14 శాతం కేసులకు కోవిడ్ హిస్టరీ లేదని వైద్యులు వెల్లడిస్తున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతున్నదనే దానిపై అధ్యయనం జరుపుతున్నారు. పూర్తిస్థాయిలో అధ్యయనం అవసరం ఉన్నదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. 477 మందిలో కోవిడ్ హిస్టరీ లేకపోయినా..బ్లాక్ ఫంగస్ ఎందుకు సోకిందనేదానిపై వైద్యులకు ఫజిల్ గా మారింది.

Read More : Srisailam Project : 14 ఏళ్ల తర్వాత మళ్లీ జులైలో తెరుచుకున్న శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు

డయాబెటిస్, హెచ్ఐవి ఉన్నవాళ్లలో ఫంగల్ ఇన్ ఫెక్షన్ లు దాడి చేస్తాయని, కరోనా కారణంగా చాల మందిలో షుగర్ లెవల్స్ అదుపుతప్పుతున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే కోవిడ్ సమయంలో బ్లాక్ ఫంగస్ విజృంబించిందని జైపూర్ SMS మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ సుధీర్ భండారి వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన తర్వాత..అధికంగా స్టెరాయిడ్స్ వినియోగించడం, డయామెటిక్ రోగుల్లో షుగర్ లెవల్స్ అదుపు తప్పడానికి దారి తీస్తుందని..ఈ కారణంగా..బ్లాక్ ఫంగస్ సోకుతుందని వైద్యులు వెల్లడిస్తున్నారు.