Rath Yatra: ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ

ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు.

Rath Yatra: ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ

New Project (1)

Rath Yatra: ఒడిశాలోని పూరీలో 48గంటల పాటు కర్ఫ్యూ విధించారు. జులై 12న మొదలుకానున్న రథ యాత్ర సందర్భంగా ఆదివారం నుంచి అమలుచేయనున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆదేశం ప్రకారం.. ఆదివారం రాత్రి 8గంటల నుంచి జులై 13రాత్రి 8గంటల వరకూ కర్ఫ్యూ అమలవుతుంది.

వార్షికంగా జరిగే ఈ రథ యాత్రలో భాగంగా జులై 12 జగన్నాథ స్వామి ఊరేగింపు జరుగుతుంది. ఈ మేరకు అన్ని ఎంట్రీ పాయింట్లు ఇప్పటికే మూసేసినట్లు ఒడిశా ప్రభుత్వం చెప్పింది. కొవిడ్ మహమ్మారి కారణంగా భక్తులు ఎక్కువ మంది రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు.

పూరీ కలెక్టర్ సమర్థ వర్మ ఈ మేరకు హోటల్స్, లాడ్జింగుల్లోకి టూరిస్టులను అనుమతించవద్దని శనివారమే ఆర్డర్ పాస్ చేసింది. పలు కంపెనీల ప్రైవేట్ గెస్ట్ హౌజ్ లు, ఇతర కార్పొరేట్ హౌజ్ లకు సంబంధిత ఉత్తర్వులు ఇష్యూ చేశారు. పండుగ రోజుల్లో పూరీని సందర్శించడానికి వెళ్లొద్దని రథ యాత్రను లైవ్ గా టీవీలో ప్రసారం చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

వార్షికంగా జరిగే జగన్నాథ స్వామి రథ యాత్ర సంబరాలు శుక్రవారం నుంచే మొదలయ్యాయి. ఈ సారి భక్తులు ఆచారాలను మిస్ అవుతుండటమే కాకుండా కరోనా మహమ్మారి కారణంగా నేరుగా చూసేందుకు వీల్లేకుండా పోయింది.