ఢిల్లీలోని ఓ ఇంట్లో 48 ఆక్సిజన్ సిలిండర్లు సీజ్

కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని ఓ ఇంట్లో 48 ఆక్సిజన్ సిలిండర్లు సీజ్

Oxygen Cylinders

Oxygen Cylinders కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెడికల్ ఆక్సిజన్ కు డిమాండ్ పెరిగిన విషయం తెలిసిందే. దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు,ఢిల్లీలో కూడా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు ఆక్సిజన్‌ సిలిండర్లను బ్లాక్‌చేసి డబ్బులు దండుకుంటున్నారు చేసుకుంటున్నారు.

శుక్రవారం ఢిల్లీలోని ఒక ఇంటి నుండి 48 సిలిండర్ల ఆక్సిజన్‌ సిలిండర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజధానిలోని నైరుతి ప్రాంతంలోని ఓ ఇంటిపై రైడ్ చేసిన ఢిల్లీ పోలీసు బృందం 32 పెద్ద, 16 చిన్నఆక్సిజన్‌ సిలిండర్లను స్వాధీనం చేసుకుంది. తనకు పారిశ్రామిక ఆక్సిజన్ వ్యాపారం ఉందని చెప్పుకున్న ఇంటి యజమాని అనిల్ కుమార్‌(51)ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే, అనిల్ కుమార్ తన వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్‌ను చూపించలేదని పోలీసులు తెలిపారు. నిందితుడు..పెద్ద సిలిండర్ల నుండి బదిలీ చేసిన తర్వాత ఒక చిన్న సిలిండర్‌ను రూ.12,500 కు అమ్మేవాడని పోలీసులు తెలిపారు. నిందితుడు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న ఆక్సిజన్ సిలిండర్లను పోలీసులు శనివారం అవసరమైన వారికి పంపిణీ చేయనున్నారు.

ఇటీవల కాలంలో ఆక్సిజన్ ను అక్రమంగా నిల్వ చేస్తున్న కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. గురువారమే ఢిల్లీలో అక్రమంగా నిలువ ఉంచిన 70 ఆక్సిజన్‌ సిలిండర్లను అధికారులు సీజ్‌చేశారు. నైరుతి ఢిల్లీలోని ఓ ఆక్సిజన్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంలో అక్రమంగా నిల్వ ఉంచిన 70 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.