MLA’s, MP’s: చట్టసభల్లో నేరస్తులైన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరుగుతోంది

నేరచరిత్ర వుండి పార్లమెంటు, శాసనసభల్లో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది అమిక్యుస్ క్యూరీ.

MLA’s, MP’s: చట్టసభల్లో నేరస్తులైన ఎమ్మెల్యేలు, ఎంపీల సంఖ్య పెరుగుతోంది

Supreme Court

MLA’s, MP’s: నేరచరిత్ర వుండి పార్లమెంటు, శాసనసభల్లో ప్రవేశించేవారి సంఖ్య పెరుగుతోందని సుప్రీంకోర్టుకు వెల్లడించింది అమిక్యుస్ క్యూరీ. ఎంపీలు, ఎమ్మెల్యేలపై వున్న కేసుల విచారణ ప్రతిరోజూ జరగాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు అమిక్యుస్ క్యూరీ విజయ్ హన్సారియా.

చట్టసభల్లో సభ్యులైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై ప్రస్తుతం 4వేల 984 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐదేళ్ల కంటే ఎక్కువకాలం పేరుకుపోయిన కేసులు 1899గా ఉన్నాయని సీనియర్ న్యాయవాది, కోర్టు సహాయకుడు విజయ్ హన్సారియా సుప్రీంకోర్టుకు తెలిపారు.

గడిచిన రెండేళ్లలో ప్రజాప్రతినిధులపై కేసులు సంఖ్య 4122 నుండి 4984కు పెరిగినట్లు కోర్టుకు తెలిపారు. సీబీఐ, ఈడీ, ఎన్ఐఎతో సంబంధం వున్న కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీని నియమించాలని కూడా ఈ సంధర్భంగా కోరారు అమిక్యుస్ క్యూరీ.

రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని నియమించి వివరాలను సుప్రీంకోర్టుకు తెలియజేసింది అమిక్యుస్ క్యూరీ. 2018 డిసెంబరు 4 తర్వాత 2,775 కేసులు పరిష్కరించినా, ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు 4,122 నుంచి 4,984కు పెరిగాయని, దీన్ని బట్టి నేర చరిత్ర ఉన్న వ్యక్తులు పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీల్లోకి ప్రవేశిస్తున్నారని స్పష్టం అవుతోంది.

చాలా రాష్ట్రాల్లో SC, ST, పోక్సో లాంటి చట్టాల కిందే ఎక్కువ కేసులు ఉన్నాయని, ఈ కేసులను విచారిస్తున్న న్యాయమూర్తులే ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తూ ఉండడంతో జాప్యం జరుగుతుందని క్యూరీ అభిప్రాయపడింది. ఈ కేసుల సత్వర పరిష్కారానికి డిఫెన్స్, ప్రాసిక్యూషన్ సహకరించుకునే మార్గాన్ని చూడాలని అత్యున్నత న్యాయస్థానంని కోరింది అమిక్యుస్ క్యూరీ.