ముంబాయిలో బైడెన్ బంధువులు!

  • Published By: madhu ,Published On : November 9, 2020 / 11:19 AM IST
ముంబాయిలో బైడెన్ బంధువులు!

5 Bidens In Mumbai : అమెరికా అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ ఎన్నికైన వేళ.. యావత్‌ ప్రపంచం ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుతెచ్చుకుంటోంది. జో బైడెన్‌కు భారత్‌తో అనుబంధం ఉంది. అమెరికా ఉపాధ్యక్షుడి హోదాలో భారత్‌ పర్యటనకు వచ్చిన సందర్భంగా..తనకు ఇక్కడ బంధువులు ఉన్నారని బైడెనే స్వయంగా వెల్లడించారు.



తమ కుటుంబానికి చెందిన ఐదుగురు దూరపు బంధువులు ముంబయిలోనే ఉన్నారన్నారు. 2015లో వాషింగ్టన్‌లో జరిగిన ఓ సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు బైడెన్.. వారి వివరాలు తెలిశాయన్నారు. అయితే, బైడెన్‌ ఈ విషయాన్ని చెప్పినప్పటికీ తామే బైడెన్‌ బంధువులని ఇప్పటివరకూ ముంబయి నుంచి ఎవ్వరూ ఆయనను కలవలేదు.



https://10tv.in/joe-biden-is-on-the-cusp-of-becoming-us-president-as-key-states-carry-on-counting-votes/
భారత్‌లో పర్యటనలో భాగంగా 2013 జులై 24న బాంబే స్టాక్‌ ఎక్ఛేంజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జో బైడెన్‌ ప్రసంగించారు. ఆ సమయంలో ‘బైడెన్‌ ఫ్రమ్‌ ముంబయి’ అంటూ తనకు భారత్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ”భారత్‌లో పర్యటించడం, ముఖ్యంగా ముంబయికి రావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. నేను 29ఏళ్ల వయసున్న సమయంలో (1972) తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యా.



ఆ సమయంలో భారత్‌ నుంచి బైడెన్‌ పేరుతో దూరపు బంధువు అయ్యే వ్యక్తి నుంచి ఉత్తరం వచ్చింది. అయితే, తర్వాత వారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేదని చింతిస్తున్నాను” అని తన ప్రసంగం మధ్యలో బైడెన్‌ గుర్తు చేసుకున్నారు. అయితే, వంశవృక్షంపై పరిశోధనలు చేసేవారు ఎవరైనా తమ బంధువుల సమాచారం తనతో పంచుకోవచ్చని బైడెన్‌ కోరారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ఎన్నికైన నేపథ్యంలో ఆయన‌ బంధువులు ముంబయిలో ఉన్నారన్న విషయం మరోసారి ఆసక్తిగా మారింది.