Drug Trafficking: పాక్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 17 మంది అరెస్టు.. నిందితుల్లో ఐదుగురు పోలీసులు

జమ్ము-కాశ్మీర్ ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న పెద్ద ముఠాను కుప్వారా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. 17 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం.

Drug Trafficking: పాక్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 17 మంది అరెస్టు.. నిందితుల్లో ఐదుగురు పోలీసులు

Drug Trafficking: పాకిస్తాన్ నుంచి దేశంలోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే. పాక్ సరిహద్దు గుండా కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాలకు, అక్కడ్నుంచి దేశవ్యాప్తంగా డ్రగ్స్ సరఫరా అవుతోంది. దీన్ని కట్టడి చేసేందుకు కేంద్రం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది.

Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

డ్రగ్స్ ముఠాల్ని పట్టుకుంటూనే ఉన్నారు పోలీసులు. తాజాగా కాశ్మీర్‌లో మరో డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పాకిస్తాన్ నుంచి కాశ్మీర్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్ము-కాశ్మీర్‌, కుప్వారా జిల్లాలోని కెరాన్ సెక్టార్ వద్ద ఈ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నిందితుల్లో ఐదుగురు పోలీసులు కూడా ఉండటం విశేషం. పోలీసులతోపాటు నిందితుల్లో షాపు యజమానులు, రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరు కాశ్మీర్‌లోని అనేక ప్రాంతాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ నుంచి షకీర్ అలీ ఖాన్ అనే వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

డ్రగ్స్ సరఫరా ముఠాలో భారీ నెట్‌వర్క్ ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి రెండు కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు కాశ్మీర్ జిల్లాలోనే డ్రగ్స్ సరఫరాకు సంబంధించి 85 కేసులు నమోదు చేసి, 161 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాగా, ఈ ప్రాంతంలో డ్రగ్స్ అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.