భారత్‌లో 39 మందికి కరోనా.. కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి..

దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.

  • Published By: veegamteam ,Published On : March 8, 2020 / 10:50 AM IST
భారత్‌లో 39 మందికి కరోనా.. కేరళలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురికి..

దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. కొత్తగా 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది.

భారత్ లో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కరోనా కేసులు 39కి పెరిగాయి. దేశంలోనే తొలిసారిగా కరోనా కేసు నమోదైన కేరళలో మరోసారి కరోనా కలవరం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే కేరళలో కొత్తగా 5 కరోనా పాటిజివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కల్గింస్తోంది. దీంతో భారత్ లో నిన్నటి వరకు 34 వరకే ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నేటికి 39కి చేరింది.

కేరళలో మరోసారి కరోనా కన్నెర్ర జేసింది. వూహాన్ నుంచి ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందించి డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్లీ కరోనా కలకలం రేపింది. కేరళలో మరో ఐదుగురికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబీకులు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

కేరళకు చెందిన బాధితుల్లో ముగ్గరు ఇటీవలే ఇటలీకి వెళ్లి తిరిగి వచ్చారు. వీరితో పాటు కాంటాక్టులో ఉన్న మరో ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. అయితే ఇటలీ నుంచి తిరిగి వచ్చినా తర్వాత ఎయిర్ పోర్టులోని హెల్ప్ డెస్క్ కు కానీ, సమీపంలోని ఆస్పత్రికి గానీ బాధితులు రిపోర్టు చేయలేదని కేరళ ప్రభుత్వం అంటుతోంది. జ్వరం, జలుబు లక్షణాలు బయటపడటంతో వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

కరోనా కొత్త కేసులతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. వారితో కాంటాక్టులో ఉన్నవారిని గుర్తించడంపై దృష్టి పెట్టారు. ఆ ఐదుగురితోపాటు విమానంలో ప్రయాణించిన వారు కూడా తక్షణమే రిపోర్టు చేయాలని సూచించింది.

మరోవైపు ఉత్తరప్రదేశ్ లో 6, ఢిల్లీలో 3, కేరళలో 3, జమ్మూకాశ్మీర్ లో 3, తెలంగాణ, తమిళనాడులో ఒక్కొక్కరితోపాటు 16 మంది ఇటలీ పర్యాటకులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 39 కరోనా కేసులు నమోదు అయ్యాయి.