kerala : కేరళలో వర్ష బీభత్సం..ఐదుగురు మృతి,12మంది గల్లంతు

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

kerala : కేరళలో వర్ష బీభత్సం..ఐదుగురు మృతి,12మంది గల్లంతు

Kerala (1)

కేరళలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. పలు జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.

ఇడుక్కి, కొట్టాయం, పథనంతిట్ట జిల్లాల్లో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగాయి. వర్షాలకు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందగా.. కొట్టాయంలో కొండచరియలు విరిగిపడ్డ సంఘటనలో 12 మంది గల్లంతయ్యారు. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు

కాగా..ప‌థ‌నంథిట్ట‌, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిసూర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరికలతో ఆ ఐదు జిల్లాల్లో రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. అదేవిధంగా భారీ వ‌ర్ష‌సూచ‌న ఉన్న ఏడు జిల్లాలు- తిరువ‌నంత‌పురం, కొల్లామ్‌, అల‌ప్పుజ‌, పాల‌క్కాడ్‌, మ‌ల‌ప్పురం, కోజికోడ్‌, వాయ‌నాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అల‌ర్ట్ జారీచేశారు.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ వరద బాధితులకు సహాయం అందించేందుకు రంగంలోకి దిగాయి. అత్యవసర పరిస్థితుల్లో Mi-17, సారంగ్ హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచారు. సదరన్ ఎయిర్ కమాండ్ పరిధిలో అన్ని వైమానిక స్థావరాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు.

ALSO READ కేరళలో వర్ష బీభత్సం..మునిగిన కార్లు,బస్సులు..5 జిల్లాల్లో రెడ్ అలర్ట్