Haryana : హర్యానాలో విషాదం..ఆక్సిజన్ అందక..ఐదుగురు మృతి ?

Haryana : హర్యానాలో విషాదం..ఆక్సిజన్ అందక..ఐదుగురు మృతి ?

Haryana

Die Haryana Oxygen Shortage : భారతదేశంలో కరోనా విజృంభిస్తోంది. లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. ప్రధానంగా ఆక్సిజన్ లేకపోవడంతో చాలా మంది మరణిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత ఉండడంతో కేంద్రం పలు చర్యలు తీసుకొంటోంది. అయితే..హర్యానా రాష్ట్రంలోని హిసార్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఐదుగురు కరోనా రోగులు చనిపోయారు.

మెడికల్ ఆక్సిజన్ కొరత కారణంగానే వీరు చనిపోయారని కుటుంబసభ్యులు వెల్లడిస్తున్నారు. తమ వారు చనిపోవడానికి ఆసుపత్రి యాజమాన్యమే కారణమంటూ ఆరోపిస్తూ..ఆందోళనలకు దిగారు. తమకు ఆక్సిజన్ సరఫరా పరిమితంగానే ఉందని, దీనిపై జిలా యంత్రాంగాన్ని తరచూ చెప్పడం జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పరిమితమైన నిల్వలు మాత్రమే ఉన్నాయని ఉదయం 9 గంటల నుంచి అధికారులకు చెబుతున్నట్లు, రోజుకు 300 మెడికల్ ఆక్సిజన్ సిలిండర్ల వినియోగం ఉంటుందని తెలపార. ఖాళీ సిలిండర్లు నింపి ఇవ్వాల్సిందిగా వెండర్లకు పంపామని వెల్లడిస్తున్నారు.

Read Moe : ఢిల్లీ వాసులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితం