నిర్లక్ష్యం..దారుణం : ఐదుగురికి కరోనా అంటించాడు..అందులో 9 నెలల చిన్నారి

  • Published By: madhu ,Published On : March 28, 2020 / 07:28 AM IST
నిర్లక్ష్యం..దారుణం : ఐదుగురికి కరోనా అంటించాడు..అందులో 9 నెలల చిన్నారి

కరోనా ఒకవైపు విజృంభిస్తూ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపుతోంది. క్వారంటైన్ లో చికిత్స పొందుతున్న వారు..నిబంధనలు అతిక్రమించి..బయటకు వచ్చి..ఇతరులకు వైరస్ సోకే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఓ వ్యక్తి ఐదుగురికి వైరస్ సోకే విధంగా ప్రవర్తించాడు. అందులో..9 నెలల పాప ఉండడం అందరిని కలిచివేస్తోంది. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ చోటు చేసుకుంది. దీంతో ఈ రాష్ట్రంలో కేసుల సంఖ్య 15కి చేరుకుంది. 

ఓ యువకుడు బ్రిటన్ లో చదువుకుని..ఇటీవలే భారత్ కు వచ్చాడు. అప్పటికే కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. దీంతో విమానాశ్రాయాల్లో స్ర్కీన్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అతనికి కూడా అలాగే వ్యవహరించారు. అందులో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించాయి. దీంతో వెంటనే ఢిల్లీలోని క్వారంటైన్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కానీ నిబంధనలను అతిక్రమించాడు. అక్కడున్న వారి కళ్లుగప్పి..పారిపోయాడు.

వెస్ట్ బెంగాల్ కు చేరుకున్నాడు. తర్వాత..ఓ ఫంక్షన్ కి హాజరయ్యాడు. ఈ శుభకార్యానికి ఎంతో మంది హాజరయ్యారు. అనంతరం ఈ శుభకార్యంలో పాల్గొన్న 27 ఏళ్ల మహిళకు కరోనా లక్షణాలు బయటపడ్డాయి. ఈమె నుంచి…9 నెలల చిన్నారి, 6 సంవత్సరాల కుమారుడికి, 45 ఏళ్ల మరో మహిళకు, ఆమె కుమారుడికి (11) కూడా సోకింది. దీనికంతటికి కారణం ఆ యువకుడే అని తెలుసుకున్నారు.

వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. అతడిని నిర్భందంలోకి నెట్టారు. సదరు మహిళ కుటుంబాన్ని మార్చి 23వ తేదీ నుంచి క్వారంటైన్ లో నుంచి చికిత్స అందిస్తున్నారు. వీరందరికీ కరోనా సోకిందని 2020, మార్చి 28వ తేదీ శనివారం తేలింది. ఇంకా ఆ యువకుడి నుంచి మరెంత మందికి సోకిందనే దానిపై అధికారులు విచారిస్తున్నారు.