5- జడ్జీలతో బెంచ్: 10న అయోధ్య కేసుపై విచారణ

అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.

  • Published By: sreehari ,Published On : January 8, 2019 / 12:14 PM IST
5- జడ్జీలతో బెంచ్: 10న అయోధ్య కేసుపై విచారణ

అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టు వచ్చే గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది.

  • జనవరి 10న విచారణ ప్రారంభం.. 

లక్నో: అయోధ్య మందిరం నిర్మాణం వివాదంపై సుప్రీంకోర్టులో గురువారం (జనవరి 10) విచారణ ప్రారంభం కానుంది. చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ కేసుపై విచారించి కీలక నిర్ణయాన్ని వెల్లడించనుంది. ఇందుకోసం మంగళవారం ఐదుగురు జడ్జీల కాన్సిట్యూషన్ బెంచ్ ఏర్పడింది. ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న అయోధ్య ఆలయం నిర్మాణ వివాదం చుట్టూ రాజకీయ దుమారాన్ని రేపింది. రామాలయాన్ని నిర్మించాలని ఇప్పటికే పలు డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు నుంచి వెలువడే తీర్పు కీలకంగా మారనుంది.

మరోవైపు అధికార బీజేపీ సహా అనుకూల గ్రూపు సంస్థలు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించక ముందే రామ మందిర నిర్మాణం ప్రారంభించేలా ప్రత్యేక ప్రభుత్వ ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గత ఏడాదిలో రామాలయ నిర్మాణం కేసుపై వెంటనే తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. గతంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంను ఆశ్రయించిన పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీం విచారించనుంది.