పాము ఉందని తగలబెడితే.. 5చిరుతలు చనిపోయాయి

  • Published By: vamsi ,Published On : April 4, 2019 / 03:57 AM IST
పాము ఉందని తగలబెడితే.. 5చిరుతలు చనిపోయాయి

మహారాష్ట్రలోని అంబేగామ్ తాలూకా గావడీవాడీ గ్రామంలో 5 చిరుతపులులు మంటల్లో స జీవ దహనం అయిపోయాయి. చెరకుపొలంలో పాము ఉందని కూలీలు నిప్పంటించంతో రెండు మగ, మూడు ఆడ చిరుతపులి పిల్లలు మంటల్లో చిక్కుకుని చనిపోయాయి. గావడీవాడీ గ్రామానికి చెందిన గోపినాథ్ గునాగేకు చెరకు తోట ఉండగా.. చెరకు కోసేందుకు చక్కెర ఫ్యాక్టరీకి చెందిన కూలీలు ఉదయం 6గంటలకు వచ్చారు. చెరకు తోటలో అత్యంత విషపూరితమైన పాము కూలీలకు కనిపించింది. దీంతో పామును చంపేందుకు చెరకుతోటకు నిప్పు అంటించారు కులీలు.

అయితే చెరకు తోట కాలిన తర్వాత చూస్తే అక్కడ 15రోజుల వయస్సు ఉన్న 5చిరుతపులి పిల్లల కళేబరాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతపులి పిల్లల కళేబరాలకు పోస్టుమార్టం చేయించిన అనంతరం గ్రామస్థుల సహకారంతో పూడ్చిపెట్టారు. ఈ క్రమంలోనే గ్రామస్థులకు హెచ్చరికలను జారీ చేశారు అధికారులు. చిరుతపులి పిల్లలు చనిపోయిన నేపథ్యంలో తల్లి చిరుతపులి గ్రామ ప్రజలపై దాడి చేసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు చెప్పారు.