Oxford వ్యాక్సిన్‌ కొనుక్కోవాల్సిన అవసరం లేదు..ప్రభుత్వాలే కొని..ఇచ్చే అవకాశం

  • Published By: madhu ,Published On : July 22, 2020 / 08:34 AM IST
Oxford వ్యాక్సిన్‌ కొనుక్కోవాల్సిన అవసరం లేదు..ప్రభుత్వాలే కొని..ఇచ్చే అవకాశం

Oxford University వ్యాక్సిన్‌ కొనుక్కోవాల్సిన అవసరం లేదు..సర్వసాధారణంగా..ప్రభుత్వాలే వ్యాక్సిన్ ను కోనుగోలు చేసి ఇమ్యునైజేషన్ కార్యక్రమంలో భాగంగా..ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తాయని సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ (Serum Institute of India CEO) Adar Poonawalla, వెల్లడించారు. టీకా ధర రూ. 1000 ఉండవచ్చునని, అంతకంటే తక్కువే ఉంటుదని అదార్ తెలిపారు.

ఫ్రంట్ లైన్ వర్కర్లు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే…తొలి దశలో వ్యాక్సిన్ ఇవ్వడం నైతిక ధర్మమని, అయితే…తొలుత ఎవరికి ఇవ్వాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.

ప్రపంచాన్ని కరోనా వణికిస్తోంది. వ్యాక్సిన్ కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు బిజీ బిజీగా పనిచేస్తున్నారు. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న భారత ప్రజలు రిలీఫ్ ఇచ్చే న్యూస్ వినిపించింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమయ్యాయని లాన్సెట్ జర్నల్ ప్రకటించింది.

ఈ క్రమంలో సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదార్‌ పూనావాలా ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడారు. వ్యాక్సిన్ డోసుల్లో సగం భారత్ కు పంపిణీ చేసి..మిగతా డోసులు ఇతర దేశాలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

పూణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా వ్యాక్సిన్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ. వ్యాక్సిన్ ట్రయల్స్ అన్నీ సాఫీగా సాగి ఫలితాలు సానుకూలంగా వస్తే..టీకాల తయారీలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో భాగస్వామిగా ఉంటామని అదార్ చెప్పారు.

వ్యాక్సిన్ మూడో దశ మానవ ప్రయోగాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు రాగానే..ఆగస్టులో ప్రయోగాలు చేస్తామన్నారు. టీకా ఉత్పత్తి ప్రారంభం కాగానే…ప్రతి నెల మార్కెట్ కి విడుల చేసే టీకా దోసుల్లో సగం భారత్ కు సరఫరా చేయడం జరుగుతుందని, భారత ప్రజలతో పాటు ప్రపంచ ప్రజల రోగ నిరోధక వ్యవస్థ ముఖ్యమేనన్నారు.

అన్ని అనుకున్నట్లుగానే..జరిగితే..ఈ ఏడాది చివరిలోగా..కొన్ని లక్షల వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తి జరుగుతుందని, వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 30 నుంచి 40 కోట్ల టీకా డోసులని తయారు చేసే సామర్థ్యం తమ సంస్థకు ఉందన్నారు అదార్.