కోవిడ్ -19పై పోరాటం : సేవ చేసేందుకు ముందుకొచ్చిన 500 మంది వైద్యులు

  • Published By: madhu ,Published On : March 26, 2020 / 05:20 AM IST
కోవిడ్ -19పై పోరాటం : సేవ చేసేందుకు ముందుకొచ్చిన 500 మంది వైద్యులు

కోవిడ్ – 19 పోరాటం చేసేందుకు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ఈ రాకాసిని బయటకు పంపేందుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పని చేస్తున్నారు. అందులో వైద్యులు కీలకం. రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా వైరస్ ని అరికట్టేందుకు నడుం బిగించింది. 500 మంది వైద్యులు సేవ చేసేందుకు ముందుకొచ్చారని పంజాబ్ హెల్త్ మినిస్టర్ బల్బీర్ సింగ్ సిద్దూ వెల్లడించారు.

పరిస్థితి మొత్తం కంట్రోల్ ల్లో ఉందని..కోవిడ్ – 19 వైరస్ కారణంగా..31 కేసులు నమోదయ్యాయని తెలిపారు.  విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని, ఇప్పటి వరకు క్యారంటైన్ చేయలేదన్నారు. ఇప్పటికే కర్ఫ్యూ విధించినట్లు, వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. 

ఈ కరోనాను అరికట్టేందుకు స్పెషలిస్టులు, ఆయుర్వేద డాక్టర్లు వాలంటీర్లుగా ముందుకు రావాలని మంత్రి బల్బీర్ సింగ్ పిలుపునిచ్చారు. వీరికి రూ. 5 వేలు, రూ. 3 వేల 500, రూ. 2 వేలు ప్రతి రోజు ఇస్తామన్నారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు, నవషహార్ లో 200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు, 25 వేల మాస్కులు, 5 వేల శానిటైజర్, 300 PPE Ktis ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకున్నామన్నారు. 

Also Read | ఫీవర్‌ హాస్పిటల్‌లో కరోనా టెస్టులు ప్రారంభం