500మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందుకు రెడీగా ఉన్నారు

  • Published By: venkaiahnaidu ,Published On : October 11, 2019 / 01:30 PM IST
500మంది ఉగ్రవాదులు కశ్మీర్ లో చొరబడేందుకు రెడీగా ఉన్నారు

కశ్మీర్ లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు రెడీగా ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. దాదాపు  500 మంది ఉగ్రవాదులు కశ్మీర్‌లో చొరబడడి అలజడులు సృష్టించేందుకు పీవోకేలోని టెర్రర్ క్యాంప్ ల దగ్గర రెడీగా ఉన్నారని  వేచి ఉన్నారని ఆర్మీ ఉన్నతాధికారి శుక్రవారం(అక్టోబర్-11,2019) సంచలన ప్రకటన చేశారు. దీంతో దేశంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.

నియంత్రణా రేఖ వెంబడి తీవ్ర అలజడులు సృష్టించడానికి 200-300మంది ఉగ్రవాదులు పాక్ సహకారంతో ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇక జమ్మూకశ్మీర్‌లోని తీవ్రవాదుల విషయానికొస్తే, దాదాపు రెండు నుంచి మూడు వందల మంది తీవ్రవాదులు స్థానిక తీవ్రవాదులతో కలిసి అలజడి సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని నార్తన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణవీర్ సింగ్ తెలిపారు. దాదాపు ఐదు వందల మంది తీవ్రవాదులు జమ్మూలో ప్రవేశించడానికి కాచుకొని కూర్చొన్నారని, అయితే వారి వారి శిక్షణా సమయాన్ని బట్టి ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. తీవ్రవాదులు ఎందరొచ్చినా తాము మాత్రం వారిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రణవీర్ సింగ్ అన్నారు.

కశ్మీర్ లో అలజడులు సృష్టించాలని పాక్ సృష్టిస్తోందని,ఇవాళ్టికి కూడా పాకిస్తాన్ లో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రన్ అవుతోందని సింగ్ తెలిపారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దుతు ఇస్తూనే ఉందన్నారు. డ్రోన్ల ద్వారా ఉగ్రవాదులకు ఆయుధాలు చేరవేడమనే కొత్త పద్ధతిని పాక్ ఫాలో అవుతుందన్నారు. కొన్ని పాక్ డ్రోన్స్ భారత్ లోని పంజాబ్ లోకి అక్రమంగా ప్రవేశించి ఆయుధాలను సరఫరా చేస్తున్న విషయాన్ని సింగ్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.