ఓటు చైతన్యం : ఆకట్టుకుంటున్న అరుణ మహిళల డాన్స్ 

ఓటు చైతన్యం  : ఆకట్టుకుంటున్న అరుణ మహిళల డాన్స్ 

దేశం వ్యాప్తంగా  లోక్ సభ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తవ్వగా మరికొన్ని రాష్ట్రాలలో జరగాల్సి ఉంది. ఇప్పటికే ఐదు విడతలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతలు జరగాల్సి ఉంది. ఆరో విడతగా మే 12న, చివరిగా మే 19న జరిగే ఎన్నికలతో పూర్తవనున్నాయి. ఇదిలా ఉండగా..ఓటు హక్కు ప్రతీ పౌరుడి హక్కు. ఓటు విలువను తెలిపేలా ఎన్నికల కమిషన్ ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఈ క్రమంలో ఓటుహక్కుపై మహిళలు నిర్వహించిన నృత్య కార్యక్రమం అందరిని అలరించింది. ఆకట్టుకుంది. 

ఓటు హక్కుపై చైతన్యం కల్పించేందుకు హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన మహిళలు వినూత్న కార్యక్రమం నిర్వహించారు.  5 వేల మంది మహిళలు తమ ఓటరు కార్డులతో జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రంలోని ధల్‌పూర్‌ గ్రౌండ్‌లో మహిళలు హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయ దుస్తులు ధరించి జానపద నృత్యాన్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులోకెక్కింది. కాగా అన్ని రాష్ట్రాలలోను ఎన్నికలు పూర్తయిన అనంతరం 543 లోక్‌సభ స్థానాల ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.