Uttarakhand village: గ్రామ జనాభా 141.. కరోనా పాజిటివ్ 51మందికి

కొవిడ్ తీవ్రత దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. గ్రామంలో ఒకరికో ఇద్దరికో కరోనా పాజిటివ్ రావడం కాదు. 141మంది జనాభా ఉన్న గ్రామంలో 51 మందికి పాజిటివ్ వచ్చినట్లు శనివారం అధికారులు వెల్లడించారు.

Uttarakhand village: గ్రామ జనాభా 141.. కరోనా పాజిటివ్ 51మందికి

Uttarakhand Village

Uttarakhand village: కొవిడ్ తీవ్రత దేశవ్యాప్తంగా వణుకు పుట్టిస్తోంది. గ్రామంలో ఒకరికో ఇద్దరికో కరోనా పాజిటివ్ రావడం కాదు. 141మంది జనాభా ఉన్న గ్రామంలో 51 మందికి పాజిటివ్ వచ్చినట్లు శనివారం అధికారులు వెల్లడించారు. గ్రామం మొత్తాన్ని కంటైన్మోంట్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు.

ఉత్తరప్రదేశ్ లోని పౌరీ జిల్లాలో కుర్‌ఖ్యాల్ గ్రామంలో ఏకేశ్వర్ బ్లాక్ లో చాలా మందికి కొవిడ్-19 లక్షణాలు అయిన జ్వరం లాంటివి కనిపించాయి. మే11న శాంపుల్స్ పరీక్షించిన ప్రైమరీ హెల్త్ సెంటర్ హెల్త్ డిపార్టమెంట్ టీం.. ఈ విషయాన్ని వెల్లడించారు.

శుక్రవారం రిపోర్టులు అందాయని 141మంది ఉన్న గ్రామంలో 51మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు. గ్రామస్తులను హోం ఐసోలేషన్ లో ఉంచి, మెడిసిన్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యగా మార్కెట్ ను కూడా మూసేశారు.

ఆ గ్రామానికి వెళ్లిన ఆరుగురు పక్క గ్రామస్థులకు కూడా కరోనా సోకిందని అధికారులు తెలిపారు. గ్రామంలో ఉన్న వారితో అంగన్వాడీ వాలంటీర్లు టచ్ లో ఉండాలని.. సీరియస్ గా ఉంటే కొవిడ్ కేర్ సెంటర్ కు తీసుకువెళ్లాలని సూచించారు. రీసెంట్ గా సిటీల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్నట్లుగా తెలిసింది.

శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఇదే విషయాన్ని తెలియజేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని అందరం కలిసి సమస్యను అధిగమించాలని పిలుపునిచ్చారు.