ఈఏడాది 5,100సార్లు పాక్ కాల్పులు

ఈఏడాది 5,100సార్లు పాక్ కాల్పులు

ceasefire violations by Pakistan in 2020 నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడుతూనే ఉంది దాయాది దేశం. ఎల్​ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఫార్వర్డ్​ పోస్టులు, గ్రామాలను పాకిస్థాన్​ లక్ష్యంగా చేసుకుని కాల్పులకు పాల్పడుతోంది. 2020లో నియంత్రణ రేఖ వెంబడి 5,100సార్లు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అంటే రోజుకు సగటున 14 కేసులు.

ఈ ఘటనల్లో 36మంది మరణించారు. వీరిలో 24మంది భద్రతా సిబ్బంది ఉన్నారు. 130మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు 2020లో 203మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో 166మంది స్థానిక ముష్కరులు ఉన్నారు. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం. వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్​ చేసినట్టు తెలుస్తోంది.

కాగా, ఒప్పందం కుదుర్చుకున్న దాదాపు 18ఏళ్లల్లో పాకిస్తాన్ కాల్పులుకు తెగబడటం ఈ ఏడాదే అత్యధికమని భద్రతా అధికారులు తెలిపారు. భారత్​-పాక్​ మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అంతకుముందు 2002లో ఏకంగా 8,376 సార్లు పాకిస్తాన్​ దళాలు.. భారత గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయి.

2018లో మొత్తం 2,936సార్లు పాక్​ సైన్యం దుశ్చర్యలకు పాల్పడిందని భద్రతా అధికారులు తెలిపారు. వివరించారు. 2019లో ఈ సంఖ్య 3,289 అని అధికారులు తెలిపారు. వీటిల్లో 1,565 ఘటనలు.. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం జరిగాయని తెలిపారు.