కర్నాల్ స్కూల్ లో 54మంది విద్యార్థులకు కరోనా

కర్నాల్ స్కూల్ లో 54మంది విద్యార్థులకు కరోనా

Karnal హర్యానాలోని ఓ స్కూలోలో పెద్ద సంఖ్యలో విద్యార్ధులు కరోనా బారినపడ్డారు. కర్నాల్ సిటిలోని ఓ స్కూలోలో 54మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు కర్నాల్ సివిల్ సర్జన్ యోగేష్ కుమార్ శర్మ తెలిపారు. సోమవారం ముగ్గురు విద్యార్థులకు కరోనా సోకిందని..కాంటాక్ట్ ట్రేసింగ్ తర్వాత మరికొందరు విద్యార్ధులకు టెస్ట్ లు చేయగా మరో 54మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. తమ మెడికల్ బృందాలు స్పాట్ కి చేరుకుని స్కూల్ హాస్టల్ బిల్డింగ్ కు సీల్ వేసి కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించినట్లు శర్మ తెలిపారు.

కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి మూతపడిన స్కూల్స్.. 1-3వ తరగతి విధ్యార్థులకు కోసం దాదాపు ఏడాది తర్వాత ఫిబ్రవరి-24,2021నుంచి ప్రారంభమయ్యాయి. 1-2వ తరగతి విద్యార్థుల కోసం మార్చి-1నుంచి సూల్స్ ప్రారంభమయ్యాయి. 9-12వ తరగతి విద్యార్ధుల కోసం గతేడాది డిసెంబర్ లోనే స్కూల్స్ తెరుచుకున్నాయి.

అన్ని కోవిడ్ సంబంధిత నిబంధనలు పాటించాలని మరియు ప్రామాణిక నిర్వహణ విధానాలు(SOPs)పాటించాలని స్కూల్స్ కి ఆదేశాలు ఇవ్వబడ్డాయి. విద్యార్థులను స్కూల్స్ కి పంపాలంటూ వారి తల్లిదండ్రులపై ఒత్తిడిచేయవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్కూల్స్ కి సూచించింది. విద్యార్ధులను స్కూల్స్ కి పంపేముందు వారి తల్లిదండ్రులు స్కూల్ హెడ్ లేదా క్లాస్ టీచర్ కి కన్సంట్(సమ్మతి)లెటర్ సమర్పించాల్సి ఉంటుంది.

మహారాష్ట్ర,పంజాబ్,కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్న వేళ పలు హెచ్చరికలతో పలు రాష్ట్రాలు స్కూల్స్ రీఓపెన్ చేస్తోన్న విషయం తెలిసిందే. గత నెలలో కేరళలోని మలప్పురంలో రెండు స్కూల్స్ లోని 192మంది 10వ తరగతి విద్యార్ధులకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ఇప్పుడు హర్యానాలో ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకడం ఇప్పుడు కలకలం రేపుతోంది.