జులై-31నాటికి ఢిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులు

  • Published By: venkaiahnaidu ,Published On : June 9, 2020 / 09:40 AM IST
జులై-31నాటికి ఢిల్లీలో 5.5 లక్షల కరోనా కేసులు

దేశ రాజధానిలో కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి (కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్)లేదని,కానీ 50శాతం కేసులకు మూలం తెలియలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. కేంద్రప్రభుత్వ అధికారులు ఇంకా ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరుగలేదని చెప్పారని ఇవాళ(జూన్-9,2020) ఢిల్లీ విపత్తు నిర్వహణా అథారిటీ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా వైరస్‌ లక్షణాలతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మీటింగ్‌ లో పాల్గొనలేదు. కేజ్రీవాల్ కు ఇవాళ కరోనా టెస్ట్ లు జరిగాయి. ఇంకా రిపోర్టులు రాలేదు.

కాగా, ఈ మీటింగ్ కు కొద్దిసేపు ముందే ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఢిల్లీలో 50 శాతం కేసులకు సోర్స్‌(మూలం) కనుక్కోలేకపోయినట్లు చెప్పిన విషయం తెలిసిందే. 50శాతం మందికి ఎటునుంచి కరోనా సోకిందో అర్థం కాలేదని,మహమ్మారి మూడో దశ అయిన కమ్యూనిటీ స్ప్రెడ్ లోకి ఢిల్లీ ఎంటర్ అయిందని లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ నివాసంలో మీటింగ్ కు ముందు సత్యేంద్ర జైన్ అన్నారు.

ఎయిమ్స్‌ డైరెక్టర్‌‌ రణదీప్ గులేరియా కూడా ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ఉందన్నారని,కానీ కేంద్రప్రభుత్వం దానిని ఇంకా అంగీకరించలేదని,తాము దీనిని డిక్లేర్ చేయలేమని,కేంద్రమే దానిని డిక్లేర్ చేయాలని గులేరియా అన్నారని సత్యేంద్ర జైన్ అన్నారు. వ్యాధి ఎలా సోకిందనే దానిపై స్పష్టత లేనప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్‌ స్టార్ట్‌ అయిందనే నిర్ధారణకు వస్తాం. ఢిల్లీలోని 50 శాతం కేసులు సోర్స్‌ లేనివే. కేంద్రం చెప్పినప్పుడు మాత్రమే దానిపై ఒక స్పష్టత వస్తుంది అని గులేరియా చెప్పారని జైన్ అన్నారు.

అయితే కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్ జరుగలేదని మీటింగ్ తర్వాత మనీష్ సిసోడియా తెలిపారు. కరోనా పెషంట్ల కోసం హాస్పిటల్స్‌లోని బెడ్లను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తెలిపారు. ఢిల్లీలో గడిచిన 12-13రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని మనీష్ సిసోడియా తెలిపారు. జూన్ 30నాటికి ఢిల్లీలోని కరోనా పేషెంట్ల కోసం 15వేల బెడ్స్ అవసరమవుతాయని,జూలై-15నాటికి 33వేల బెడ్స్,జులై 31నాటికి 80వేల బెడ్స్ అవసరమవుతాయని మనీష్ తెలిపారు.

జూన్ 15నాటికి ఢిల్లీలో 44వేల కేసులు నమోదయ్యే అవకాశముందని,జూన్-30నాటికి కేసులు 1లక్ష వరకు చేరుకుంటాయని, జులై 15నాటికి 2లక్షల 25వేల కేసులు నమోదవుతాయని,జులై 31నాటికి దేశరాజధానిలో 5లక్షల 50వేల కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందనిఅంచానా వేసినట్లు మనీష్ సిసోడియా తెలిపారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఢిల్లీలోని ప్రభుత్వ,ప్రైవేట్ హాస్పిటల్స్ లోని బెడ్స్ ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వ్ చేస్తూ తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని,కానీ సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ తమ ప్రభుత్వ ఆర్డర్ ను కొట్టిపారేశారని సిసోడియా అన్నారు. గవర్నర్ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తదని సిసోడియా అన్నారు.