5g services in hyderabad : హైదరాబాద్‌లో 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్

5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు  ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.  5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటి

5g services in hyderabad : హైదరాబాద్‌లో 5జీ నెట్ వర్క్ ట్రయల్ రన్

5g Trail Run

5g services in hyderabad : 5జీ నెట్ వర్క్ కు సంబంధించిన పరికరాలను, నెట్ వర్క్ ను పరీక్షించేందుకు  ఎంపికైన నగరాల్లో హైదరాబాద్ కూడా ఉంది.  5జీ నెట్ వర్క్ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ తుది దశలో ఉందని డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందని టెలికం శాఖ తెలిపింది.

ఎయిర్ టెల్, జియో, వోడో ఫోన్ ఐడియా సంస్ధలు హైదరాబాద్, చెన్నై నగరాలతోపాటు ఢిల్లీ, ముంబై, గురుగాఁవ్, పూణే, బెంగుళూరు, చండీగఢ్, కోల్‌కతా, జామ్‌నగర్, అహ్మదాబాద్,  హైదరాబాద్, లక్నో మరియు గాంధీ నగర్ వంటి పెద్ద నగరాల్లో 5జీ సేవలపై ట్రయల్ రన్ నిర్వహించనున్నాయి.

Also Read : Flight Cancelled : పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు-పండగల వేళ 11,500 విమానాలు రద్దు

వచ్చే ఏడాది ఆయా నగరాల్లో మొదటగా 5జీ సర్వీసులను ప్రారంభంలోకి తీసుకురానున్నారు. 5జీ టెస్ట్ బెడ్ ప్రాజెక్ట్ కు టెలికం విభాగం రూ. 224 కోట్ల రూపాయల మేర నిధులు అందిస్తోంది. ఐఐటీ హైదరాబాద్, చెన్నై,ఢిల్లీ, ముంబై, కాన్పూర్, బెంగుళూరు,తోపాటు సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ లాంటి 8 సంస్ధలు దీనిపై గత 3 ఏళ్లుగా పని చేస్తున్నాయి.