5G Network : 10 రెట్లు పెరగనున్న ఇంటర్నెట్ స్పీడ్

5జీ... మనిషి లైఫ్‌ స్టైల్‌ని పూర్తిగా మార్చేందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. 5జీ నెట్‌ వర్క్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్‌ కనెక్టివిటీ,

5G Network : 10 రెట్లు పెరగనున్న ఇంటర్నెట్ స్పీడ్

5g Network

5G Network : 5జీ… మనిషి లైఫ్‌ స్టైల్‌ని పూర్తిగా మార్చేందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. 5జీ నెట్‌ వర్క్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్‌ కనెక్టివిటీ, మొబైల్‌ నెట్‌ వర్కింగ్‌ వ్యవస్థతో పాటు.. వర్చవల్​ రియాల్టీ, ఓటీటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది.

కాగా, ఆగస్టు 15 సందర్భంగా ప్రధాని మోదీ 5జీ నెట్‌ వర్క్‌ను అధికారికంగా ప్రారంభిస్తారంటూ టెలికాం నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంతో భారత్‌ లో హార్డ్‌ వేర్‌, సాఫ్ట్‌ వేర్‌ రంగాలకు తిరుగుండదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ టెస్టింగ్‌లో గ్లోబల్ లీడర్ ‘ఓక్లా’ మన దేశంలో ఇంటర్నెట్‌ వినియోగంపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. 5జీ వినియోగంతో మన దేశంలో ఇంటర్నెట్‌ వేగం 10రెట్ల కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

5జీ నెట్‌ వర్క్‌.. ఆసక్తికర విషయాలు
* 2020 థాయిలాండ్‌, ఫిలిప్పిన్స్‌లో 5జీ నెట్‌ వర్క్‌ ప్రారంభమైంది. ఓక్లా అంచనా ప్రకారం.. ప్రస్తుతం ఉన్న 4జీ ఎల్‌ టీఈ(Long-Term Evolution) నెట్‌ వర్క్‌ కంటే 5జీ స్పీడ్ గా ఉంటుందని, దాన్ని బేస్‌ చేసుకొని 2021 ఏప్రిల్‌ నాటికి దాని వేగం 9 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది. ఇదే సమయంలో భారత్‌ లో విడుదల కానున్న 5జీ నెట్‌ వర్క్‌ వేగం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

* 2021 మార్చిలో 52.9 శాతం నుండి జూన్ నాటికి 64.5 శాతం మంది 4G వినియోగదారులు 5ఎంబీపీఎస్‌ కంటే ఎక్కువగా వీడియోల్ని డౌన్‌లోడ్ చేస్తున్నారని, దీన్ని బట్టి ఇండియన్‌ ఇంటర్నెట్‌ యూజర్లు 5G నెట్‌ వర్క్‌ను ఎలా వినియోగిస్తారో చెప్పడం అసాధ్యం. అయితే దేశ వ్యాప్తంగా 5G నెట్‌ వర్క్‌ వినియోగం పెరిగిపోతుందని ఓక్లా ప్రతినిధులు వెల్లడించారు.

* మన దేశంలో జియో నెట్‌ వర్క్‌ వినియోగం అంతకంతకూ పెరిగిపోతుంది. ఆ జియో నెట్‌ వర్క్‌ డౌన్‌లోడ్ వేగం మార్చి 2021లో 5.96 Mbps నుండి జూన్‌లో 13.08 Mbps కి పెరిగింది.

* ప్రస్తుతం, యూకే, యూఎస్‌ వంటి దేశాల్లో 5 నెట్‌ వర్క్‌ను విస్తరించే పనిలోపడ్డారు. ఆ విషయంలో భారత్‌ వెనకబడినా.. ఇటీవల కాలంలో 5జీ నెట్‌ వర్క్‌ ఏర్పాటు కోసం గ్రౌండ్‌ వర్క్‌ చేస్తున్నట‍్లు ఓక్లా గుర్తించింది.

* 5జీ నెట్‌ వర్క్‌ ఆలస్యం వల్ల ఆపరేటర్లకు లబ్ధి చేకూరుతుందని, తక్కువ ఖర్చుతో నెట్‌వర్క్ ఎక్విప్‌ మెంట్‌ కొనుగోలు చేయవచ్చు. ఇండియన్‌ ఆపరేట్లు ఓపెన్‌ ర్యాన్‌ నెట్‌ వర్క్‌ (open radio access network architecture) వల్ల 5జీ నెట్‌ వర్క్‌ ఏర్పాటుకు అయ్యే ఖర్చు తగ్గిపోతుందని ఓ ఇంటర్నెట్ టెస్టింగ్‌ గ్లోబల్ లీడర్ ఓక్లా అంచనా వేసింది.